https://oktelugu.com/

వంగవీటి రాధ.. వైసీపీలోకి రానున్నారా?

రాజకీయాల్లో వంగవీటి మోహన రంగా పేరు వింటేనే హల్ చల్. ఎన్టీఆర్ అంతటి వాడినే గడగడలాడించిన వ్యక్తి. కానీ రాజకీయాల్లో ఆయన వారసత్వం లేకపోవడం విచిత్రమే. ఆయనను నమ్ముకుని వచ్చిన వారంతా మహా నాయకులు అయిపోయారు. ఆయన కొడుకు మాత్రం ఎటు కాకుండా ఉండిపోయారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే అవకాశం కోసం వేచి చూస్తున్నా ఆయనకు కలిసి రావడం లేదు. ఫలితంగా పార్టీలు మారినా ప్రతిఫలం మాత్రం దక్కడం లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని […]

Written By: , Updated On : July 8, 2021 / 07:55 AM IST
Follow us on

రాజకీయాల్లో వంగవీటి మోహన రంగా పేరు వింటేనే హల్ చల్. ఎన్టీఆర్ అంతటి వాడినే గడగడలాడించిన వ్యక్తి. కానీ రాజకీయాల్లో ఆయన వారసత్వం లేకపోవడం విచిత్రమే. ఆయనను నమ్ముకుని వచ్చిన వారంతా మహా నాయకులు అయిపోయారు. ఆయన కొడుకు మాత్రం ఎటు కాకుండా ఉండిపోయారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే అవకాశం కోసం వేచి చూస్తున్నా ఆయనకు కలిసి రావడం లేదు. ఫలితంగా పార్టీలు మారినా ప్రతిఫలం మాత్రం దక్కడం లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలోో కొట్టుమిట్టాడుతున్నారు.

వంగవీటి రాధ వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. వైసీపీ నుంచి2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయాలని జగన్ కోరినా రాద అంగీకరించలేదు. టీడీపీలో చేరి మద్దతు ఇచ్చినా ఆ పార్టీ ఓటమి పాలైంది. దీంతో రాధకు మాత్రం లాభం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి వైసీపీలో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గోదావరి జిల్లాల్లో తోట త్రిమూర్తులుకు జగన్ తో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో రాధ ఆయనతో కలిసి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పైగా కాపుల్లో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అందుకే రాధ ఆయనను ఎంచుకున్నారు. అయితే వంగవీటి రాధాకృష్ణకు వైసీపీలోకి ఆహ్వానం ఉంటుందా అన్నదే ప్రశ్న. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ విజయం సాధించాలంటే వంగవీటి వంటి వారిని నమ్మక తప్పదనే విషయం బోధపడుతోంది. దీంతో జగన్ రాదను ఆదరిస్తారనే ప్రచారం సైతం సాగుతోంది.

వైసీపీకి కాపుల ఓట్లే ప్రధానం కానున్నాయి. దీంతో ఆయన రాధ రాకను సాదరంగానే తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎవరు వచ్చినా కాదనరు. కాబట్టి వంగవీటికి ఈసారి వైసీపీలోనే సీటు ఖాయమనే విషయం తెలుస్తోంది. ఇదే జరిగితే వంగవీటి కుటుంబ వారసుడిగా రాధ తన ప్రభావాన్ని చూపించే అవకాశం దక్కుతుతందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

రాధ చేరితో సమీకరణలు మారుతాయి. కాపుల ఓట్లు ప్రధానంగా వైసీపీకే పడతాయనే భావం కూడా కలుగుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణల కోసమైనా రాధ వైసీపీకి అవసరమే. ఈ కోణంలో వైసీపీలోకి రాధ వస్తే లాభమే ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తానికి రాధ ఎటు తిరిగినా చివరికి వైసీపీ గూటికే చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.