https://oktelugu.com/

Vanama Venkateswara Rao Son: అతను మొదటి నుంచి అలానే.. అరాచకాలకు కేరాఫ్ ఆ ఎమ్మెల్యే కొడుకు..!

Vanama Venkateswara Rao Son: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు, టీఆర్ఎస్ లీడర్ రాఘవేంద్ర రావు వివాదాలకు కేంద్ర బిందువు అయ్యాడు.గతంలో అనేక కేసుల్లో ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తాజాగా పాల్వంచ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయం అవుతున్నది. ఇప్పటికే ఆయనపై మొత్తం ఆరు క్రిమినల్ కేసులు ఉన్నాయి. పలువురి సూసైడ్స్‌కు సంబంధించి రాఘవేంద్రరావు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పాల్వంచకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయమై పోలీసులు […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 6, 2022 / 03:22 PM IST
    Follow us on

    Vanama Venkateswara Rao Son: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు, టీఆర్ఎస్ లీడర్ రాఘవేంద్ర రావు వివాదాలకు కేంద్ర బిందువు అయ్యాడు.గతంలో అనేక కేసుల్లో ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తాజాగా పాల్వంచ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయం అవుతున్నది. ఇప్పటికే ఆయనపై మొత్తం ఆరు క్రిమినల్ కేసులు ఉన్నాయి. పలువురి సూసైడ్స్‌కు సంబంధించి రాఘవేంద్రరావు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

    Vanama Venkateswara Rao Son

    పాల్వంచకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా, రామకృష్ణ ఆత్మహత్యకు ముందర సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. అది తాజాగా వెలుగులోకి వచ్చింది. అందులో సంచలన విషయాలు బయటపడ్డాయి. తన ఆత్మహత్యకు కొత్తగూడం ఎ మ్మెల్యే వనమా కుమారుడు వనమా రాఘవేంద్రరావు కారణమని ఆరోపించారు.

    గతంలోనూ రాఘవేంద్రరావుపై ఇటువంటి సంచలన ఆరోపణలు వచ్చాయి. ఓ గిరిజన మహిళకు చెందిన స్థలం విషయంలో రాఘవేంద్రరావు అనుచరులు భౌతిక దాడికి దిగినట్లు కేసు నమోదు అయింది. ఈ కేసు అప్పట్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ వరకు వెళ్లింది. ఇకపోతే ఫైనాన్స్ వ్యాపారి వెంకటేశ్వర్లు సూసైడ్ కేసులోనూ రాఘవేంద్రరావు ఏ1 ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలా ఆది నుంచి అతను ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అరాచకాలు చేస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి.

    Also Read: అమిత్ షా లూప్ హోల్ పై కొట్టిన కేటీఆర్

    తాజా ఘటన నేపథ్యంలో రాజకీయ దుమారమే చెలరేగుతోంది. నాగా రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఏ2గా ఉన్న రాఘవను అరెస్టు చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేస్తున్నారు. రాఘవేంద్రరావు అరాచకాలను పోలీసులు పట్టించుకోలేదని, దాంతో ఆయన వలన ఓ కుటుంబం ప్రాణాలు తీసుకుందని భట్టి విమర్శించారు. ఎంతో మంది చనిపోవడానికి, ఆత్మహత్యలకు రాఘవ కారణం అని విక్రమార్క ఆరోపించారు.

    రాఘవేంద్రరావును కఠినంగా శిక్షించాలని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాఘవేంద్రరావు చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లే కనబడుతోంది. ఈ కేసులో చర్యలను పోలీసులు వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే రాఘవేంద్రరావు పరారీలో ఉండగా, అతని కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

    Also Read: తెలుగు రాష్ట్రాల్లో కోర‌లు చాస్తున్న పేద‌రికం.. ఏపీ కన్నా తెలంగాణలోనే ఎక్కువ..

    Tags