Raashi Khanna: బబ్లీ హీరోయిన్ రాశి ఖన్నాకి టాలెంట్ లేకపోయినా ఫుల్ గ్లామర్ ఉంది. ఇక ఎక్స్ ప్రెషన్స్ పలికించలేకపోయనా ఫుల్ ఎక్స్ పోజింగ్ చేస్తోంది. అందుకే ఈ బబ్లీ బ్యూటీ ఎలాగోలా కెరీర్ ను నెట్టుకొస్తూనే ఉంది. తాజాగా బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ‘యోధ’ అనే చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాకి సాగర్ అంబ్రే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో రాశికి ఛాన్స్ రావడానికి ముఖ్య కారణం సాగర్ అంబ్రేనే.
ఆయనే హీరోకి ఇష్టం లేకపోయినా ఏరికోరి రాశికి అవకాశం ఇచ్చాడు. రెండేళ్లుగా తెలుగులో రాశి ఖన్నాకు చెపుకోతగ్గ స్థాయిలో అవకాశాలు రాలేదు. తన హవా టాలీవుడ్ లో కాస్త తగ్గుముఖం పట్టిందని తెలుసుకున్న ఈ బ్యూటీ, బాలీవుడ్ కి మకాం మార్చింది. అక్కడ చిన్న సినిమాలతోనైనా ఎంట్రీ ఇవ్వాలని చాలా ప్రయత్నాలు చేసింది. కానీ వర్కౌట్ కాలేదు.
దాంతో అక్కడి దర్శకనిర్మాతలను ఆకట్టుకోవడానికి ఎక్స్ పోజింగ్ లో పరిధి దాటింది. అమ్మడు అందం అదుర్స్ అన్నారు. దానికి తోడు రాశి కూడా గ్లామర్ డోస్ ను రోజురోజుకు పెంచుకుంటూ పోయింది. సోషల్ మీడియాలో తనలోని ఒంపుసొంపుల ప్రదర్శనను పరిపూర్ణంగా ప్రదర్శిస్తూ దూసుకుపోయింది. మొత్తానికి సాగర్ అంబ్రే కళ్ళల్లో పడింది.
Also Read: తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా ఎందుకు రాణించలేక పోతున్నారు ?
బాలీవుడ్ ఛాన్స్ కోసం రాశి ఖన్నా అతనితో టచ్ లో ఉంది. ఈ క్రమంలో సాగర్ అంబ్రే రాశితో ప్రేమలో పడ్డాడు. అతని సాన్నిహిత్యాన్ని రాశి కూడా అంగీకరించింది. అతనితో డేటింగ్ కోసం సింగపూర్ కూడా వెళ్ళింది. చివరకు సాగర్ అంబ్రే ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా సెట్లో అడుగు పెడుతూ.. రాశి ఖన్నా ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేసింది.
‘‘ఇంత సాదర స్వాగతం పలికినందుకు చిత్ర బృందానికి ధన్యవాదాలు యోధ సెట్లో.. తొలిరోజు’’ అంటూ తన స్టేటస్ లో మెసేజ్ పోస్ట్ చేసింది. ఏది ఏమైనా ఈ బబ్లీ హీరోయిన్ పాపం స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. ఎప్పుడూ సెకండ్ గ్రేడ్ లోనే నిలిచిపోయింది. అందుకే, స్టార్ హీరోల సినిమాల్లో ఆమెకు అవకాశాలు రావడం లేదు.
Also Read: పాత సినిమాకి కొత్త టైటిల్ పెట్టి రిలీజ్ చేస్తే వర్కౌట్ అవుతుందా ?