AP CM Jagan: జగన్ బాటలోనే విపక్షాలు.. బలమైన ‘ప్రతి’ వ్యూహాలు..

AP CM Jagan: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం బాగా హీటెక్కిన సంగతి అందరికీ తెలిసిందే. నూతన సంవత్సరంలో విపక్షాలు అధికార వైసీపీ పక్షమై ముప్పేట దాడికి సిద్ధమయ్యాయి. ఏ చిన్న అంశం దొరికినా జగన్ సర్కారును టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు రెండున్నరేళ్లు ఉన్నప్పటికీ విపక్షాలు మాత్రం రాజకీయ క్షేత్రంలో సరైన ప్లాన్‌తో ముందుకు సా..గుతున్నట్లు కనబడుతోంది. ఇప్పటి వరకు తమదైన వ్యూహాలతో అధికార వైసీపీని అడ్డుకోవాలని విపక్ష పార్టీలు భావించాయి. కానీ, వైసీపీ మాత్రం చాలా […]

Written By: Mallesh, Updated On : January 6, 2022 3:06 pm
Follow us on

AP CM Jagan: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం బాగా హీటెక్కిన సంగతి అందరికీ తెలిసిందే. నూతన సంవత్సరంలో విపక్షాలు అధికార వైసీపీ పక్షమై ముప్పేట దాడికి సిద్ధమయ్యాయి. ఏ చిన్న అంశం దొరికినా జగన్ సర్కారును టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు రెండున్నరేళ్లు ఉన్నప్పటికీ విపక్షాలు మాత్రం రాజకీయ క్షేత్రంలో సరైన ప్లాన్‌తో ముందుకు సా..గుతున్నట్లు కనబడుతోంది.

AP CM Jagan

ఇప్పటి వరకు తమదైన వ్యూహాలతో అధికార వైసీపీని అడ్డుకోవాలని విపక్ష పార్టీలు భావించాయి. కానీ, వైసీపీ మాత్రం చాలా ఫోకస్‌డ్‌గా తన లక్ష్యం దిశగానే ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే ప్రత్యర్థులను సవాల్ చేయడంతో పాటు వారికి అస్సలు ఏ విషయంలోనూ చిక్కకుండా గట్టిగానే ముందుకు సాగుతోంది. ఇక ఎన్నికల టైం వచ్చే నాటికి ఇంకా బలంగా ముందుకు సాగాలని, దాడులతో విపక్షాలకు కళ్లెం వేయాలని వైసీపీ వర్గాలు భావిస్తున్నట్లు టాక్. కాగా, వైసీపీని టార్గెట్ చేయడానికి విపక్షాలు కూడా రెడీ అయిపోతున్నాయి. ఇంతకాలం ఫైట్ చేసినట్లుగా కాకుండా జగన్ బాటలోనే వెళ్లి ఆయనను టార్గెట్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

Also Read: నేడే పీఆర్సీపై తేల్చేయ‌నున్న జ‌గ‌న్‌.. ఉద్యోగుల ఆశ‌లు ప‌దిల‌మేనా..?

గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ఇంకా చాలా దూకుడుగా వ్యవహరించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ముల్లును ముల్లుతోనే తీయాలనే సూత్రం అప్లై చేస్తూ ‘ప్రతి’వ్యూహాలను విపక్షాలు రచించుకుంటున్నాయట. అలా జగన్ బాటలో వెళ్లి ఆయన్ను ఢీ కొట్టేందుకుగాను విపక్షాలు సర్వశక్తులు ఒడ్డేందుకు ప్లాన్ చేస్తున్నాయని టాక్.

ఏపీలో ఇప్పటికే రాజకీయ క్షేత్రంలో టీడీపీ చీఫ్, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉన్నారు. సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేసిన బాబు, రాజకీయ క్షేత్రంలో బలంగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ శ్రేణులను ఉత్తేజపరిచి వచ్చే ఎన్నికల్లో రాజకీయ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. ఇక బీజేపీ సైతం దూకుడు పెంచేసింది. తన ఎజెండాను ముందుంచి మరీ రాజకీయం చేయాలని బీజేపీ ఏపీ స్టేట్ చీఫ్ సోము వీర్రాజు మాటల ద్వారా స్పష్టమవుతోంది. జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించారు. ఆయన కూడా త్వరలో ఇంకా యాక్టివ్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి. అలా ఏపీలో విపక్షాలు అధికార పక్షాన్ని అడ్డుకోబోతున్నాయి.

Also Read: ధర్మానకు ఏమైంది..? పార్టీలో ఎందుకీ పరేషాన్..

Tags