Vanama Raghava: ఒక్కొక్కరు ఒక్కో నయీమ్… నియోజకవర్గం సామంత రాజ్యం

Vanama Raghava:  ఘనులు, “మనీ” మాణిక్యాలు వారికే. కప్పం రూపంలో విలువైంది చెల్లిస్తే చాలు. కూకట్ పల్లిలో ఎకరం, బాచుపల్లిలో వైద్యం లో వాటా ఇస్తే చాలు. అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి. అప్పటిదాకా ఉద్యమ ద్రోహులుగా ఉన్నవారు అకస్మాత్తుగా ఉద్యమకారులు అవుతారు. ఫుల్ పేజి వార్తలకు అర్హులవుతారు. ఒప్పందం కుదిరిందా.. ఏమైనా చేసుకోవచ్చు ఎంతైనా వెనకేసుకోవచ్చు. ఇసుక నుంచి రియల్ వ్యాపారం దాకా…ప్రభుత్వ అధికారుల నుంచి అంగన్ వాడీ పోస్టుల దాకా ఎంతయినా దండు కోవచ్చు. అంతటా పాగా […]

Written By: NARESH, Updated On : January 9, 2022 4:43 pm
Follow us on

Vanama Raghava:  ఘనులు, “మనీ” మాణిక్యాలు వారికే. కప్పం రూపంలో విలువైంది చెల్లిస్తే చాలు. కూకట్ పల్లిలో ఎకరం, బాచుపల్లిలో వైద్యం లో వాటా ఇస్తే చాలు. అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి. అప్పటిదాకా ఉద్యమ ద్రోహులుగా ఉన్నవారు అకస్మాత్తుగా ఉద్యమకారులు అవుతారు. ఫుల్ పేజి వార్తలకు అర్హులవుతారు. ఒప్పందం కుదిరిందా.. ఏమైనా చేసుకోవచ్చు ఎంతైనా వెనకేసుకోవచ్చు.

Vanama Raghava

ఇసుక నుంచి రియల్ వ్యాపారం దాకా…ప్రభుత్వ అధికారుల నుంచి అంగన్ వాడీ పోస్టుల దాకా ఎంతయినా దండు కోవచ్చు. అంతటా పాగా వేయొచ్చు. ఎదురు ప్రశ్నిస్తే భార్యలను గెస్ట్ హౌస్ లకి తీసుకుని రమ్మని హుకుం జారీ చేయొచ్చు. ఒకవేళ ఆత్మాభిమానం ఉండి, వ్యవస్థలు న్యాయం చేస్తాయనే నమ్మకం ఉండి, పొరబాటున పక్కా ఆధారాలతో కోర్టుకు వెళితే నడి బజారులో తెగ నరుకుతారు. లాయర్లనే నరికిన వారికి సామాన్యులు ఒక లెక్కా.

తా చెడ్డ కోతుల మాదిరి “వనమా”ల్ల చెరుచుతున్నారు. పౌర స్పృహ, మీడియా, సోషల్ మీడియా రంగంలోకి దిగితే తప్ప సర్కారుకు సోయి రావడం లేదు. అంతెందుకు వనమా రాఘవ లాంటి ఓ కాలకేయుడు నలుగురి ఆత్మ హత్యకు కారణమయితే అధికార పత్రికలో ఒక్క వార్త కూడా రాలేదు. కానీ అనేకానేక పరిణామాల తర్వాత వాడి పై సస్పెండ్ విధిస్తే ఓ మూలన ఇంత వార్త రాశాం అంటే రాశామ్ అన్నట్టుగా ప్రచురించింది. కానీ ఓ శివరాజ్ సింగ్ మీద దుమ్ము ఎత్తి పోయడానికి మాత్రం బీభత్సంగా ప్రయాస పడింది. నిన్న ప్రగతి భవన్ కు కేరళ సీఎం పినరయ్ విజయన్ వచ్చిన విషయాన్ని మాత్రం అశరభ శరభ అంటూ రాసుకుంది.

ఇంత జరిగినా కూడా వనమా రాఘవ నియోకవర్గానికి, అధికార పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటాడని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తన లేఖలో చెప్పాడు. అంటే ఇన్ని రోజులు వాడు అకృత్యాలు, అరాచకాలు చేశాడు. నేను ఎమ్మెల్యే అయినా షాడో మాత్రం వాడే అని ఒప్పుకున్నట్టే కదా! ఇవ్వాళా పౌర సమాజం ఒత్తిడితో వాడిని పోలీసులు పట్టుకోవచ్చు గాక కానీ రేపటి నాడు బయటకి రాకుండా ఉండడు. మళ్లీ విజృంభిస్తాడు. అందులో ఏ మాత్రం తేడా లేదు. అన్ని కేసుల్లోనూ మనం సజ్జనార్ మార్క్ న్యాయాన్ని ఆశిస్తున్నామంటే మన వ్యవస్థలో లోపాలే కారణమా? ఇక్కడ సజ్జనార్ మార్క్ న్యాయం లోనూ కొన్ని తేడాలు ఉంటాయి.

ఓ వెటర్నరీ డాక్టర్ పై హత్యాచారం జరిగితే ఒకలా, వనమా రాఘవ లాంటి వారిపై ఒకలా ఉంటుంది. ఇది నేను అంటున్న మాట కాదు. నిన్న రాఘవ ను భద్రాచలం సబ్ జైలుకు పోలీసులు తీసుకు వెళ్తుంటే చుట్టు పక్కల ప్రజల నుంచి వచ్చిన మాట. ఇంత జరుగుతున్న ఇంకా బంగారు తెలంగాణ, రైతు రాజ్యం వంటి మాటలు వినిపిస్తున్నాయంటే అంతకు మించిన మూర్ఖత్వం ఇంకోటి ఏముంటుంది.

– భాస్కర్ ఎనబోతుల