Biggest Flop: బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించిన చిత్రాలు, ప్లాప్ సినిమాల గురించి తెలుసుకునేందుకు సినీప్రియులు నిత్యం ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ప్రస్తుతం స్టార్ హీరోలంతా కూడా ప్యాన్ ఇండియా లెవల్లో కలెక్షన్లు రాబడుతున్నారు. దీంతో బాలీవుడ్ హీరోలకు ధీటుగా మిగతా ఇండస్ట్రీలకు చెందిన హీరోలు ఎదుగుతూ సత్తా చాటుతున్నారు.

బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలు, అలాగే ప్లాపులు నిలిచిన చిత్రాలన్నీ కూడా బాలీవుడ్ హీరోలపైనే ఉన్నాయి. హిట్ మూవీ సంగతి పడితే గత కొన్నాళ్లుగా షారూఖా ఖాన్ మూవీ ‘జీరో’, రణబీర్ కపూర్ నటించిన ‘బాంబే వెల్వెట్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద ప్లాపులుగా రికార్డుకెక్కాయి.
ఈ లిస్టులో తాజాగా రణ్వీర్ సింగ్, దీపిక పదుకోన్ కలిసి నటించిన ‘83 మూవీ’ నిలువనుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో భారీ తారాగణంతో ఈ మూవీని కబీర్ ఖాన్ తెరకెక్కించారు. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈమూవీని కబీర్, దీపిక పదుకోన్, తదితరులు నిర్మించారు. సినీ క్రిటిక్స్ నుంచి ఈ మూవీకి ప్రశంసలు, మంచి రివ్యూలు వచ్చాయి. అయితే కలెక్షన్లను మాత్రం ఈ సినిమా రాబట్టలేకపోతోంది.
ఈమూవీ దాదాపు 80కోట్ల మేరకు నష్టం చవిచూసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. దీంతో ‘83 మూవీ’ ఇండియన్ మూవీ హిస్టరీలో అతిపెద్ద ప్లాపులుగా నిలిచిపోవడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది. కరోనా పరిస్థితుల కారణంగా ఈ సినిమా కలెక్షన్లు రాబట్టలేక పోతుందని తెలుస్తోంది. ఒక పరిస్థితులు సవ్యంగా ఉన్నప్పటికీ బ్రేక్ ఈవెంట్ వరకైనా వచ్చేదేమో అన్న టాక్ విన్పిస్తోంది.