CM Jagan: అభిమానులు అంతా ఒక్కటే.. తమ అభిమాన నాయకుడు లేదా నటుడు తమకు ఆనందం కలిగించే విషయం ఏదైనా చెప్పాడంటే వారికి ప్రేమకు హద్దులుండవు. దానిని ఏదో ఒక రూపంలో చూపిస్తుంటారు. కొందరు రక్తంతో బొట్టు పెడితే మరికొందరు పాలాభిషేకం చేస్తుంటారు.మరికొందరు నోట్ల కట్టలతో దండ చేసి మెడలో వేస్తారు. కానీ ఈ అభిమానం మాత్రం కాస్త డిఫరెంట్ అండ్ చాలా రిచ్.. ముఖ్యమంత్రి జగన్ తమ కోరికలు తీర్చాడని ఏకంగా బంగారు పుష్పాలతో అభిషేకం చేశారు. దీనికి గల కారణాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
CM Jagan : నిరాశలో ఉన్న మమ్మల్ని ఆదుకున్నారు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి జనంలో మంచి ఫాలోయింగ్ ఉంది. తన తండ్రి వలే ప్రజలకు మంచి పాలన అందిస్తున్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన సంక్షేమ పథకాలను రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా మిస్ చేయకుండా టైంకు అమలు చేస్తున్నారు. అయితే, ఏపీ ఉద్యోగులు కొంతకాలంగా తమ పీఆర్సీపై తేల్చాలని ఏపీ ప్రభుత్వానికి పలుమార్లు వినతి చేసుకున్నారు.
లేనియెడల ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. మంత్రులతో పలుమార్లు చర్చల అనంతరం నేరుగా సీఎం జగన్ పీఆర్సీపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినందున ఎటువంటి న్యూస్ చెబుతారో అని ఉద్యోగులు ఎదురుచూడ సాగగా, సీఎం జగన్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.
Also Read: Fish Hubs: హతవిధీ.. చేపల బిజినెస్ లోకి దిగిన ఏపీ సర్కార్?
23 శాతం ఫిట్ మెంట్‌తో పాటు రిటైర్మెంట్ ఏజ్‌ను 60 నుంచి 62 ఏళ్లకు పెంచడంతో ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీంతో ఉద్యోగులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. తాము అడిగిన దాని కంటే ఎక్కవగా ఇచ్చినందుకు తమ ప్రియతమ ముఖ్యమంత్రిపై అంతులేని అభిమానాన్ని చాటారు. శ్రీ కాళహస్తి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఏకంగా బంగారు పుష్పాలతో ముఖ్యమంత్రి చిత్రపటానికి అభిషేకం చేశారు. ర్రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేకున్నా తమ ఫ్యామిలీల సంక్షేమం కోసం PRCప్రకటించినందుకు ఇలా కృతజ్ఞతలు తెలిపామని వారు తెలిపారు.
Also Read: Secretariat employees: ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన సచివాలయ ఉద్యోగులు