https://oktelugu.com/

అమెరికా వివక్ష: భారత్ కు రష్యా ‘వ్యాక్సిన్’ అండ

ప్రపంచానికి పెద్దన్న అమెరికా తన దేశ పౌరులే ఫస్ట్ అని చెప్పింది. మిలియన్ల ఆక్స్ ఫర్డ్ టీకాలు ఖాళీగా గోదాముల్లో మూలుగుతున్నా కూడా కరోనా సెకండ్ వేవ్ తో అల్లాడుతున్న భారత్ కు ఆ వ్యాక్సిన్లను ఇవ్వడం లేదు. అమెరికన్లందిరికీ టీకాలు వేసేందుకు ముందస్తుగా ఆర్డర్ ఇచ్చి వాటిని అలాగే ఉంచుకుంది. అయితే అమెరికా ఫైజర్, మోడెర్నా టీకాలు మాత్రమే అమెరికన్లు వేసుకుంటున్నారు. బ్రిటన్ ఆక్స్ ఫర్డ్ టీకాలు మిలియన్ల కొద్దీ ఖాళీగానే అమెరికా వద్ద ఉన్నా […]

Written By: , Updated On : June 1, 2021 / 02:41 PM IST
Follow us on

ప్రపంచానికి పెద్దన్న అమెరికా తన దేశ పౌరులే ఫస్ట్ అని చెప్పింది. మిలియన్ల ఆక్స్ ఫర్డ్ టీకాలు ఖాళీగా గోదాముల్లో మూలుగుతున్నా కూడా కరోనా సెకండ్ వేవ్ తో అల్లాడుతున్న భారత్ కు ఆ వ్యాక్సిన్లను ఇవ్వడం లేదు. అమెరికన్లందిరికీ టీకాలు వేసేందుకు ముందస్తుగా ఆర్డర్ ఇచ్చి వాటిని అలాగే ఉంచుకుంది. అయితే అమెరికా ఫైజర్, మోడెర్నా టీకాలు మాత్రమే అమెరికన్లు వేసుకుంటున్నారు. బ్రిటన్ ఆక్స్ ఫర్డ్ టీకాలు మిలియన్ల కొద్దీ ఖాళీగానే అమెరికా వద్ద ఉన్నా కూడా వాటిని భారత్ కు ఇవ్వడం లేదు.

అయితే భారత్ మాత్రం ఇప్పటికీ అమెరికా సాయం కోరుతోంది. గత మొదటి వేవ్ లో అమెరికాకు అవసరమైన మందులను సరఫరా చేసిన భారత్ కు అమెరికా మాత్రం మొండి చేయిచూపిస్తోంది. గతంలో ‘అజిత్రోమైసిన్’ మందులను భారత్ నిషేధించింది. అమెరికా కరోనా తో అల్లాడుతూ ఆ మందులు కావాలంటే భారత్ పంపించింది. కానీ ఇప్పుడు అమెరికా మాత్రం భారత్ అల్లాడిపోతున్నా.. వ్యాక్సిన్ల కొరత దారుణంగా ఉన్నా టీకాలు మాత్రం పంపడం లేదు. ముందుగా వారి దేశస్థులకే ప్రాధాన్యం ఇస్తోంది. టీకాల ఎగుమతిని నిషేధించింది.

భారత్ అమెరికా వెంటపడుతుంటే.. రష్యా మాత్రం భారత్ పరిస్థితి చూసి పెద్ద సాయం చేస్తోంది. మంచి మనసు నిరూపించుకుంటోంది. రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వీ టీకాలను భారత్ ఆమోదించింది. దీంతో తాజాగా హైదరాబాద్ కు దాదాపు 27 లక్షలకు పైగా డోసులను భారత్ పంపించింది. కరోనా సెకండ్ వేవ్ తో అల్లాడుతున్న భారత్ కు గొప్ప వరంగా వ్యాక్సిన్లను పంపించింది.

రష్యాకు చెందిన స్పుత్నిక్ వి టీకాలు నేడు భారత్ లోని హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరాయి. మూడో విడతలో ఈసారి దేశంలోనే తొలి అత్యధిక టీకా దిగుమతిగా 27.9 లక్షల టీకా డోసులు దిగుమతి అయ్యాయి. రష్యా నుంచి ప్రత్యేక చార్టర్డ్ ఫైటర్ విమానం ఈ టీకాలు తీసుకొని మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరింది. ఇప్పటిదాకా దాదాపు 30 లక్షల డోసులు భారత్ కు చేరుకున్నట్లయ్యింది.

ఇక భారత్ కు మరో తీపికబురును రష్యా అందించింది. జూన్ లో మరో 50 లక్షల డోసులను పంపిస్తామని రష్యా ఇదివరకే ప్రకటించింది. జూన్ రెండో వారం నుంచి స్పుత్నిక్ వి టీకాల పంపిణీని ప్రారంభించనున్నారు. దీంతో భారత్ లో ఈ నెలలో టీకాల కొరత తీరనుంది. రష్యా వ్యాక్సిన్ల వల్లనే ఈ కొరతకు చెక్ పడనుంది.