https://oktelugu.com/

వ్యాక్సిన్ డోసుల నిల్వలు..గడువు తీరిపోయే ప్రమాదం..!

కరోనా మహమ్మారిని ఎదుర్కొవడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ఎప్పటి నుంచో ప్రపంచ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకు ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని ప్రచారం చేస్తున్నారు. అయితే ఇండియాలో సెకండ్ వేవ్ కంటే ముందు వ్యాక్సిన్ వేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ సెకండ్ వేవ్ పరిస్థితి చూశాక ప్రతి ఒక్కరూ టీకా కోసం క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల వ్యాక్సిన్ కొరత ఉందని, వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంచాలని ఆందోళన చేస్తున్నారు. అయితే గత […]

Written By:
  • NARESH
  • , Updated On : June 13, 2021 / 04:06 PM IST

    Close up of a mature man taking a vaccine in his doctors office

    Follow us on

    కరోనా మహమ్మారిని ఎదుర్కొవడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ఎప్పటి నుంచో ప్రపంచ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకు ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని ప్రచారం చేస్తున్నారు. అయితే ఇండియాలో సెకండ్ వేవ్ కంటే ముందు వ్యాక్సిన్ వేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ సెకండ్ వేవ్ పరిస్థితి చూశాక ప్రతి ఒక్కరూ టీకా కోసం క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల వ్యాక్సిన్ కొరత ఉందని, వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంచాలని ఆందోళన చేస్తున్నారు.

    అయితే గత నెలలో అమెరికాలో దాదాపు 50 శాతం టీకా పూర్తయిందని ప్రభుత్వం తెలిపింది. కొన్ని చోట్ల మాస్క్ లు కూడా వాడాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది. అంటే ఆక్కడ ప్రతీ వ్యక్తికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయినందుకు ఇక కరోనా తమదగ్గరికి చేరదనే భరోసాతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇదే అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వ్యాక్సిన్ తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు.

    యూఎస్ లోని టెన్నెసీ, నార్త్ కరోలినాల్లో వ్యాక్సిన్లు వెనక్కి పంపిచేస్తున్నారట. ఇక్కడ కేవలం రోజుకు 4,500 మంది మాత్రమే వ్యాక్సిన్ వేసుకుంటున్నారట. ఇక ఒక్లహామా కొత్త ఆర్డర్ ఆర్డర్ పెట్టలేద. ఆ రాష్ట్రం దగ్గర ఏడు లక్షల డోసులు నిల్వ ఉన్నాయట. అయితే   మోడెర్నా, ఫైజర్ కు సంబంధించిన 27 వేల టీకాల గడువు ఈ నెలాఖరుకల్లా ముగియనుంది. ఇక జాన్సన్ అండ్ జాన్సన్ టీకాల పరిస్థితి కూడా అంతే ఉందని అంటున్నారు.