https://oktelugu.com/

ఆంధ్రప్రదేశ్ లో టీకా ఉత్సవం

ఆంధ్రప్రదేశ్ లో టీకా ఉత్సవం ప్రారంభమైంది. పెద్ద ఎత్తున టీకాలు వేసేందుకు ఏపీలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. 8 లక్షల నుంచి 10 లక్షల మందికి టీకా వేయాలనే లక్ష్యంగా వైద్యఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. ఏపీలో ఈ టీకా సంబురానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలకు లక్ష చొప్పున డోసులు విజయవాడ నుంచి వెళ్లాయి. మిగతా జిల్లాలకు 50వేల టీకా డోసులు పంపారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలు ఉన్న తల్లులు […]

Written By:
  • NARESH
  • , Updated On : June 20, 2021 / 11:14 AM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ లో టీకా ఉత్సవం ప్రారంభమైంది. పెద్ద ఎత్తున టీకాలు వేసేందుకు ఏపీలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. 8 లక్షల నుంచి 10 లక్షల మందికి టీకా వేయాలనే లక్ష్యంగా వైద్యఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది.

    ఏపీలో ఈ టీకా సంబురానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలకు లక్ష చొప్పున డోసులు విజయవాడ నుంచి వెళ్లాయి. మిగతా జిల్లాలకు 50వేల టీకా డోసులు పంపారు.

    ఐదు సంవత్సరాలలోపు పిల్లలు ఉన్న తల్లులు ఏపీలో సుమారు 18 లక్షల మంది ఉన్నారు. వీరిలో శనివారం వరకు 28శాతం మంది తొలి టీకా వేయించుకున్నారు. మిగిలిన వారిలో సాధ్యమైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్ వేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

    వీరితోపాటు 45 సంవత్సరాలు పైబడిన వారికి తొలి టీకా వేస్తారు. రెండో డోసుకు అర్హత కలిగిన వారికి కూడా వ్యాక్సిన్ వేయించుకునే అవకాశాన్ని కుదిరినంత వరకు కల్పించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. విదేశాలకు వెళ్లే వారికి కూడా నేడు వ్యాక్సిన్ వేస్తున్నారు.