ఆడ మగ కలవడం అనేది సృష్టికార్యం. అలా కలిస్తేనే మన మానవ మనుగడ సాధ్యమైంది. అది లేకుంటే ఈ భూమ్మీద మనుషులు, జీవరాశులు ఉండేవే కాదు. అయితే ఇప్పుడు ఆధునిక సమాజంలో ఆ ‘కలయిక’ అనేది సాధ్యపడడం లేదు. భార్యాభర్త బిజీ కాలంలో ఎవరికి వారు దూరంగా ఉండడం.. ఉద్యోగాల పేరుతో రాత్రిపగలుతేడా లేకుండా పనిచేస్తుండడంతో సంసార సుఖానికి దూరమవుతున్నారు. డబ్బు సంపాదన మీద ఆశపడి చాలా మంది నేటి ప్రపంచంలో భార్య భర్తల బంధం గురించి మరిచిపోతున్నారు. కేవలం కెరీర్ అంటూ కొందరు పెళ్లి చేసుకున్న భార్యను లేదా భర్త గురించి పట్టించుకోవడం లేదు.
తాజాగా ఈ బంధం కలయిక దూరం అయితే ఎలాంటి అనర్థాలు వాటిల్లుతాయనే దానిపై సర్వే జరిగింది. ఈ విషయంలో భార్యలే ఎక్కువగా నష్టపోతున్నారని అధ్యయనం తేల్చింది. సంపాదన కోసం భార్య ను విడిచిపెట్టి విదేశాలకు.. దూరంగా డబ్బు సంపాదిస్తున్నా చాలా మంది మొగాళ్ల వల్ల భార్యలు తీవ్ర మనో వేదనకు గురవుతున్నారు. కొందరు పక్కదారి పడుతున్నట్టు తేలింది.
భర్తను విడిచి భార్య ఎంతకాలం ఉండగలదు..?’ అనే దానిపై ప్రధానంగా సర్వే చేశారు. భర్త లేకుండా భార్య కేవలం నాలుగు నెలలు మాత్రమే ఉండగలడని సర్వేలో తేలింది. ఆ తరువాత భార్య ఒంటరితనంగా ఫీలయ్యి తన బాగోగుల గురించి పలు నిర్ణయాలు తీసుకునే అవసరం ఉందట. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న కొన్ని ప్రభుత్వాలు భార్యను విడిచి ప్రభుత్వ ఉద్యోగం చేసే భర్తలకు ప్రతీ 4 నెలలకోసారి లీవులు ఇస్తూ వారి కాపురాలు కూలకుండా చూస్తున్నాయట..
ఇలా 4 నెలలకోసారి భర్త.. భార్య దగ్గరికి వస్తే ఎలాంటి దుష్ఫరిమాణాలు ఉండవని సర్వేలో హితబోధ చేసింది. లేకుండే పెద్ద పెద్ద అనర్థాలకు దారి తీస్తుందని గుర్తించారు.. ముఖ్యంగా సైన్యంలో పనిచేసే వారికి ప్రతీ నాలుగు నెలల్లో సెలవులు ఇచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే కొందరు డబ్బుకు ఆశపడుతున్న మొగాళ్లు నాలుగు నెలల తరువాత కూడా భార్య వద్దకు రావడం లేదు. అదే అనర్థాలకు అక్రమ సంబంధాలకు దారితీస్తోందట.. భర్తపై భార్యకు మనసు లేకుండా పోతుందని గుర్తిస్తున్నారు. ఇది గమనించిన కొందరు మొగాళ్లు ఉద్యోగాలు మానేసి భార్యతో కలిసున్నారట. అందువల్ల భార్యను ఎక్కువగా కష్టపెట్టకుండా ప్రతీ 4 నెలల తరువాత కలిస్తే వారికి మీకు సుఖమని.. సంసారం వర్ధిల్లుతుందని చెబుతున్నారు.