https://oktelugu.com/

V. Hanumantha Rao : తాత హన్మంతన్న.. మళ్లీ ఏసేశాడు.. వైరల్ వీడియో

కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి తర్వాత నేనే నెంబర్ 2" అని హనుమంతరావు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సోమవారం గాంధీభవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Written By:
  • NARESH
  • , Updated On : February 26, 2024 / 08:00 PM IST
    Follow us on

    V. Hanumantha Rao : రాజకీయాలు అంటే సీరియస్ వ్యవహారాలు కావని.. అందులో కూడా బోలెడంత హ్యూమరస్ ఉంటుందని.. ఈ సువిషాల భారత రాజకీయాలకు పరిచయం చేసింది లాలూ ప్రసాద్ యాదవ్. అతడు నడుస్తుంటే.. మాట్లాడుతుంటే.. చలోక్తులు విసురుతుంటే.. ఏం చేసినా నవ్వే.. చివరికి పశువులు తినే దాణాను బుక్కినా నవ్వే. లాలూ ప్రసాద్ యాదవ్ అంటే ఉత్తరాది ప్రాంతానికి చెందిన వాడు కాబట్టి.. హిందీ వాళ్లకు కనెక్ట్ అవుతాడు. హిందీ తెలిసిన వాళ్ళకి అర్థమవుతాడు. మరి తెలంగాణ ప్రజలకు.. మొన్నటిదాకా కేఏ పాల్ ఉండేవాడు.. ఆయన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి వెళ్లాడు కాబట్టి.. ఆ స్థానాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హనుమంతరావు భర్తీ చేస్తున్నారు..

    హనుమంతరావు కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు. ఎంతమంది పార్టీలోకి వచ్చినా.. ఎంతమంది పార్టీని విడిచి వెళ్లినా.. హనుమంతరావు మాత్రం పార్టీ నే అంటిపెట్టుకొని ఉన్నాడు. రేవంత్ రెడ్డిని విమర్శించినా.. తనకు టికెట్ ఎందుకు ఇవ్వడం లేదని అధిష్టానాన్ని ప్రశ్నించినా.. అది ఆయనకే చెల్లింది. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి అనే సినిమా తీస్తే.. ఆ చిత్రంలో పోస్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసి.. అప్పట్లో వార్తల్లో వ్యక్తి అయ్యారు హనుమంతరావు. అంతేకాదు విజయ్ దేవరకొండ తో “చిల్ తాతా” అంటూ ప్రత్యేకమైన గౌరవాన్ని కూడా పొందారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కెసిఆర్, కేటీఆర్ ను ఉద్దేశించి “అల్లా నామ్ పే పైసా దేవో బాబా అంటూ నాంపల్లి దర్గా కాడ అడుక్కునేవాళ్లు” అని విమర్శించి అప్పట్లో పెద్ద చర్చకు దారి తీశారు.

    పది సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావడంతో మళ్లీ ఇప్పుడు తన పాత మేనరిజాన్ని హనుమంతరావు ప్రదర్శిస్తున్నారు. ” అందరికీ పదవులు ఉన్నాయి. నాకేం పదవి లేదు. 7, 8 సంవత్సరాలుగా నాకేమన్నా పోస్టులు ఇచ్చారా? మంత్రి పదవులు వస్తే కొంతమందికి వచ్చి ఉండొచ్చు. నాకేం పదవులు లేకపోయినా.. నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు వస్తుంటారు. కాంగ్రెస్ అంటే హనుమంతు. హనుమంతుంటే కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి తర్వాత నేనే నెంబర్ 2″ అని హనుమంతరావు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సోమవారం గాంధీభవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.