ఉత్తరాఖండ్ వరద బీభత్సానికి కారణం ఏమిటీ..?

ఉత్తరాఖండ్ లో అకస్మాత్తుగా వరదలు రావడానికి కారణం ఏమిటి..? వరదలు ముంచెత్తడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి..? అన్న అంశంపై నిపుణులు పరిశీలన ప్రారంభించారు. దీనికి భూతాపం లేదా.. వాతావరణంలో చోటు చేసుకున్న పశ్చిమ అవాంతరాలు కారణం అయి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. ఈ వాతావరణ పోకడ వల్ల వచ్చి చేరిన మంచు ఇప్పుడు కరిగి తాజా విపత్తుకు దారి తీసిందని నిపుణులు అంటున్నారు. లేదా రెండు పరిణామాలు కారణం అయి ఉండొచ్చని భావిస్తున్నారు. మంచు కొండలు విరిగి […]

Written By: Srinivas, Updated On : February 9, 2021 11:35 am
Follow us on


ఉత్తరాఖండ్ లో అకస్మాత్తుగా వరదలు రావడానికి కారణం ఏమిటి..? వరదలు ముంచెత్తడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి..? అన్న అంశంపై నిపుణులు పరిశీలన ప్రారంభించారు. దీనికి భూతాపం లేదా.. వాతావరణంలో చోటు చేసుకున్న పశ్చిమ అవాంతరాలు కారణం అయి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. ఈ వాతావరణ పోకడ వల్ల వచ్చి చేరిన మంచు ఇప్పుడు కరిగి తాజా విపత్తుకు దారి తీసిందని నిపుణులు అంటున్నారు. లేదా రెండు పరిణామాలు కారణం అయి ఉండొచ్చని భావిస్తున్నారు. మంచు కొండలు విరిగి పడడానికి గల కారణాలపై రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థలోని స్నో అండ్ అవలాంచ్ స్టడీ ఎస్టాబ్లిష్ మెంట్ శాస్త్రవేత్తలు పరిశోధన మొదలు పెట్టారు. శీతాకాలం లోనూ.. హిమానీనదం కరగడానికి నిర్దిష్ట కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. హిమానీ నదాలపై ఏర్పడే.. గ్లేషియల్ సరస్సు గట్టు తెగిపడడం వల్ల ఈ విపత్తు వచ్చిందా..? లేదా.. గతంలో కొండ చరియలు విరిగి పడడం వల్ల నదీ ప్రవాహానికి తాత్కాలికంగా అడ్డుకట్ట పడి ఏర్పడిన ఒక డ్యాం ఇప్పుడు విచ్ఛిన్నమైందా..? అన్నది అస్పష్టంగా ఉందని జీఎస్ఐ డైరెక్టర్ జనరల్ రంజిత్ రథ్ వివరించారు.

Also Read: అస్సాం టీపై కుట్ర.. బయటపెట్టిన చాయ్ వాలా.. మోదీ

ఇలాంటి విపత్తులు జరుగుతాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారని హిమానీనద నిపుణుడు ఫరూక్ అజం పేర్కొన్నారు. మంచు పర్వతాలపై చేపడుతున్న నిర్మాణాలు, కార్యక్రమాలను వారు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఉత్తరాఖండ్ ఘటనలో 500.. 600 మీటర్ల ఎత్తు నుంచి ఒక హిమానీనాద చరియలు విరిగిపడ్డాయని ప్రస్తుతానికి చెప్పొచ్చని, హిమపాతం కూడా ఇందుకు కారణం అయి ఉండొచ్చని తెలిపారు. హిమానీనాద సరస్సు గట్టు వద్ద మంచు చరియలు విరిగిపడి ఉండకపోవచ్చు. ప్రస్తుతం అక్కడే సరస్సులు గట్టకట్టి ఉంటాయి. పైగా ఆ ప్రాంతానికి చేరువలో హమానినద సరస్సు ఉన్నట్లు ఉపగ్రహ, గూగుల్ ఎర్త్ చిత్రాల్లోనూ.. వెల్లడి కాలేదు. అయితే.. హిమానీనదం లోపల చిన్నచిన్న సరస్సులు ఉండొచ్చని పేర్కొన్నారు. భూ తాపం వల్ల ఈ ప్రాంతం వేడి ఎక్కుతుందన్నారు. ఫలితంగా వర్షాపాతం, హిమపాతం లో తేడా ఉంటుందని.. శీతాకాలంలో వేడిగా ఉంటుందని, ఫలితంగా మంచు కరుగుతుందని తెలిపారు.

Also Read: మంచు కరిగితే.. ముంచడమే‘నా’..

హిమాలయాల్లో హిమానీనాదాల పరిమాణం తగ్గుతోందని ఇటీవలి అధ్యయనంలో వెల్లడైందని వాతావరణ శాస్ర్తవేత్త రాక్సీ మాథ్యూ కోల్ చెప్పారు. అయితే గతవారం పశ్చిమ అవాంతరాల కారణంగా ఈ ప్రాంతంలో భారీగా మంచు వచ్చి చేరిందని వివరించారు. ఆ తరువాత ఉష్ణోగ్రతలు పెరిగాయని, ఫలితంగా తాజా మంచులో చాలా భాగం కరిగి, ఈ ప్రాంతంలో నీరు ఎక్కువగా చేరి ఉంటుందని తెలిపారు.

మరిన్ని జాతీయం రాజకీయ వార్తల కోసం జాతీయం పాలిటిక్స్

హిమాలయ ప్రాంతంపై తక్షణం మెరుగైన పరిశీలన జరగాలని హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అంజల్ ప్రకాశ్ తెలిపారు. ఇందుకు కోసం మరిన్ని నిధులు కేటాయించాలని తెలిపారు. భూతాపం వల్లే తాజా విపత్తు జరిగి ఉంటుందని అర్థమవుతోందన్నారు. హిమాలయాల్లోని దాదాపు 8వేల మందికి హిమానీనదాల్లో పొంచి ఉన్న ముప్పుపై శాస్ర్తీయ పరిశోధన జరగాలని ప్రముఖ జల నిపుణుడు, రూర్కిలోని ఐఐటీ ఆచార్యుడు పొఫెసర్ నయన్ శర్మ వివరించారు. శీతాకాలంలో మంచు చరియలు ఎందుకు విరిగి పడుతున్నాయో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ విషయమై మేల్కోనాలని తెలిపారు.