Homeజాతీయ వార్తలుకేసీఆర్ ఏడేళ్ల పాలనపై ‘ఉత్తమ్’ సంచలన కామెంట్స్..!

కేసీఆర్ ఏడేళ్ల పాలనపై ‘ఉత్తమ్’ సంచలన కామెంట్స్..!

Uttam Kumar Reddy Resignsతెలంగాణలో త్వరలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. వరంగల్.. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు.. నాగార్జున్ సాగర్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. దీనికితోడు కేంద్రం జమిలి ఎన్నికలకు సిద్ధమవుతుందని ప్రచారం జరగుతోంది.

Also Read: కేసీఆర్ ఎఫెక్ట్.. ఏపీలో జగన్ సర్కార్ ఉద్యోగాల జాతర

ఈక్రమంలోనే తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలన్నీ తిరిగి యాక్టివ్ అవుతున్నాయి. టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ ఎదుగుతుండగా కాంగ్రెస్ వెనుకబడిపోతుంది. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం నేతలకు తలంటడంతో నాయకులంతా తిరిగి యాక్టివ్ అవుతున్నారు.

ఈక్రమంలోనే కాంగ్రెస్ సీనియర్లంతా గత కొద్దిరోజులుగా టీఆర్ఎస్ సర్కార్.. సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రతీరోజు ప్రజా సమస్యలను మీడియా ముందు ప్రస్తావిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించే పనిలో పడ్డారు.

ఇటీవల సీఎం కేసీఆర్ నియంత్రిత సాగు విధానాన్ని రద్దు చేయడంతోపాటు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయనున్నట్లు ప్రకటించారు. దీనిపై తాజాగా పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు.

టీఆర్ఎస్ ఏడేళ్ల పాలనలో 10లక్షల కోట్ల ఖర్చు చెబుతున్న కేసీఆర్.. రైతుల మద్దతు ధర కోసం చెల్లించిన రూ.7వేల కోట్లను నష్టంగా చూపించడం ఆయన అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు.

Also Read: నారాయణ విమర్శలకు రోజా కౌంటర్‌‌

రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మారిస్తే కేంద్రం కొనుగోలు చేస్తుందని.. ఆలస్యమైతే దానికి వడ్డీ కూడా కేంద్రం చెల్లిస్తుందన్నారు. మరీ ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వానికి ఎలా నష్టం వచ్చిందో తెలుపాలని ఉత్తమ్ ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో నాడు ప్రతీ గ్రామంలో ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఎత్తివేస్తే ఉద్యమాలు తప్పవని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.

ఢిల్లీ వెళ్లక ముందు కేంద్రంపై పోరాడుతానని చెప్పిన కేసీఆర్ అక్కడి వెళ్లివచ్చాక ప్లేట్ ఫిరాయించారని ఆరోపించారు. టీఆర్ఎస్.. బీజేపీలు రెండు ఒక్కటేనని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular