https://oktelugu.com/

కేసీఆర్ పై ధ్వజమెత్తిన ఉత్తమ్

ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ నీతులు చెప్పడమేగానీ పాటించారా? అంటూ టీపీపీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైరయ్యారు. శనివారం కాంగ్రెస్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరు సరిగాలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘిస్తూ సీఎం కేసీఆర్, చిన్నజీయర్ స్వామి, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. వందలాది మంది మధ్య ఉండి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 30, 2020 / 06:20 PM IST
    Follow us on


    ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ నీతులు చెప్పడమేగానీ పాటించారా? అంటూ టీపీపీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైరయ్యారు. శనివారం కాంగ్రెస్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరు సరిగాలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘిస్తూ సీఎం కేసీఆర్, చిన్నజీయర్ స్వామి, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. వందలాది మంది మధ్య ఉండి కూడా కేసీఆర్ ముఖానికి మాస్కులు ధరించలేదన్నారు. ప్రజా ప్రతినిధులు ఎవరూ కూడా కనీసం భౌతికదూరం పాటించలేదని విమర్శించారు.

    తెలంగాణలో లాక్డౌన్ రూల్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించిన సంగతి గుర్తుచేశారు. పెళ్లికి 20 మంది.. అంత్యక్రియల్లో 10మంది కంటే ఎక్కువ పాల్గొనరాదనే నిబంధన పెట్టారని తెలిపారు. ఇక సభలు, సమావేశాలకు అనుమతులు లేవని చెప్పారని అన్నారు. ఇక మాస్కులు ధరించకపోతే రూ.1000 జరిమానా విధించే నిబంధనలు కేవలం సామాన్యులకేనా? అని ప్రశ్నించారు. ఈ నిబంధనలు ప్రభుత్వ పెద్దలకు వర్తించవా? ప్రభుత్వం ప్రజలను సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో రైతులకు తీపికబురు చెబుతానంటూ ఊరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన రుణమాఫీ ఇప్పటికీ కూడా అమలు కాలేదన్నారు. రైతుబంధు ఫలాలు అందరికీ అందలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టు ద్వారానే సాగునీరు రైతులకు అందుతుందని తెలిపారు. బంగారు తెలంగాణ పేరు చెబుతూ కేసీఆర్ ప్రజలను భ్రమల్లో ఉంచుతున్నారని ఉత్తమ్ విమర్శించారు.