ఇటీవల జమ్మూకశ్మీర్ లో కథువా జిల్లాలో గులాబీ రంగు ఉన్న ఓ పావురాన్ని స్థానికులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఆ పావురం పాకిస్థాన్ గూఢాచారి అంటూ అక్కడ వారు ఆరోపించారు. దాన్ని అధికారులకు కూడా అప్పగించారు. అయితే ఇవాళ అధికారులు ఆ పావురాన్ని పంజరం నుంచి వదిలేశారు. ఎటువంటి అనుమానాస్పద సంకేతాలు లేకపోవడంతో దాన్ని రిలీజ్ చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి శైలేంద్ర మిశ్రా తెలిపారు. ఆ పావురం ఎక్కడ దొరికిందో అదే స్థానంలో దాన్ని విడిచిపెట్టారు.
పాక్ కు చెందిన పావురం ఓనర్ హబిబుల్లా.. ఆ మూగజీవాన్ని వదిలిపెట్టాలంటూ ఇండియాను వేడుకున్నాడు. అయితే పంజరం నుంచి వదిలిపెట్టిన ఆ పావురం ఓనర్ వద్దకు చేరిందో లేదో ఇంకా తెలియదు. పావురం కాళ్లపై ఉన్న కొన్ని కోడ్స్.. ఉగ్రవాదులకు సంకేతాలు కాదని ఆ పావురం ఓనర్ తెలిపాడు. దింతో పావురాన్ని భారత్ ఆర్మీ విడిచిపెట్టింది.