Job unions: ఉసూరుమనిపించిన ఉద్యోగ సంఘాలు.. ఇంతకీ సాధించిందేంటీ?

Job unions: ‘అంతన్నడింతన్నడే.. గంగరాజు.. నన్నొగ్గి వదిలేశాడే’ అనే సాంగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘కెమెరామెన్ గంగరాజుతో రాంబాబు’ అనే సినిమాలోని ఈ ఐటమ్ సాంగ్ ఇప్పుడు ఏపీలోని రాజకీయ పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. కొద్దిరోజుల క్రితం జగన్ సర్కారుతో కయ్యానికి కాలుదువ్విన ఉద్యోగ సంఘాలు పట్టుమని పదిరోజులు కూడా ఉద్యమం చేయకుండానే ముఠాముళ్లే సద్దుకున్నాయి. ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందే అంటూ మొంకిపట్టుపట్టిన నేతలంతా చివరికీ ఏం సాధించారో చెప్పలేక పోతున్నారు. ‘హామీలు […]

Written By: NARESH, Updated On : December 17, 2021 11:19 am
Follow us on

Job unions: ‘అంతన్నడింతన్నడే.. గంగరాజు.. నన్నొగ్గి వదిలేశాడే’ అనే సాంగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘కెమెరామెన్ గంగరాజుతో రాంబాబు’ అనే సినిమాలోని ఈ ఐటమ్ సాంగ్ ఇప్పుడు ఏపీలోని రాజకీయ పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. కొద్దిరోజుల క్రితం జగన్ సర్కారుతో కయ్యానికి కాలుదువ్విన ఉద్యోగ సంఘాలు పట్టుమని పదిరోజులు కూడా ఉద్యమం చేయకుండానే ముఠాముళ్లే సద్దుకున్నాయి.

Andhra Pradesh

ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందే అంటూ మొంకిపట్టుపట్టిన నేతలంతా చివరికీ ఏం సాధించారో చెప్పలేక పోతున్నారు. ‘హామీలు నెరవేరుస్తారా.. గద్దె దిగుతారా’ అంటూ ఓ రేంజులో ప్రభుత్వంపై ఫైరయిన నేతలంతా హఠాత్తుగా నీరుగారిపోయాయి. ఉద్యోగుల ప్రయోజనాలపై ఏటూ తేల్చకుండానే ఉద్యమాన్నిమధ్యలోనే వదిలేయడం వెనుక అంతర్యం ఏంటా? అనే చర్చ ఏపీ జోరుగా సాగుతోంది.

ఉద్యోగ సంఘాల మాటలు నమ్మి కొద్దిరోజులుగా ఉద్యోగులంతా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఈసారి ఎలాగైనా ప్రభుత్వంతో చర్చలు జరిపి పెండింగులో ఉన్న కొన్ని డిమాండ్లనైనా సాధించుకుంటామనే నమ్మకంతో ఉద్యోగులు సమ్మలోకి దిగారు. కనీసం పీఆర్సీ నివేదికనైనా ప్రభుత్వం నుంచి బయట పెట్టిస్తామనే ఆశతో ఉన్నారు. కానీ అలాంటిదేమీ జరుగకుండానే ఉద్యోగ సంఘాల నేతలు చేతులేత్తేశారు.

ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఉద్యోగ సంఘాల నేతలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఏం సాధించారో చెప్పకుండానే ఉద్యమాన్ని హఠాత్తుగా ఆపేయడంతో ఉద్యోగులంతా ఆశ్చర్యపోయారు. దీంతో ప్రభుత్వం కయ్యానికి దిగి ఉద్యోగులుగా ఏం సాధించామని వాళ్లలో వాళ్లే ప్రశ్నించుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇంత వరకు అసలైన పీఆర్సీ నివేదిక ఇంకా వెల్లడించలేదు.

కేవలం పీఆర్సీ నివేదిక పేరుతో కార్యదర్శుల కమిటీ నివేదికను బయటపెట్టింది. దీనికితోడు సీపీఎస్ రద్దుపై జగన్ సర్కార్ మడమ తిప్పేసింది. జగన్ తెలియక హామీ ఇచ్చారంటూ సజ్జల చేసిన కామెంట్స్ తో సీపీఎస్ రద్దు అటెకెక్కినట్లుగానే కన్పిస్తోంది. ఉద్యోగులకు ఉన్న డబ్బై సమస్యల్లో ప్రభుత్వం ఏ ఒక్క దానికి పరిష్కారం కూడా చూపించలేదు.

వీటిన్నింటికి కాలపరిమితి పెట్టుకొని చర్చల ద్వారా పరిష్కరించుకుందామని బగ్గన రాజేంద్రనాథ్  లాంటి నేతలు హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సమ్మె విరమించుకుంటున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు.

Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. టెక్ మహీంద్రాలో జాబ్స్.. మంచి జీతంతో?

దీంతో ఇన్ని రోజుల ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే సమ్మె చేశారా? అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.పదిరోజుల్లో పీఆర్సీ ప్రకటన ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ అంశం ఉద్యోగులను పూర్తిగా గందరగోళానికి గురిచేస్తోంది. ఈ అంశం ఇలానే సాగదీసే అవకాశం ఉండనుంది.

ఇకపై ఉద్యోగుల ప్రయోజనాలు ప్రభుత్వం వద్ద అలాగే పెండింగులో ఉంటాయి. సమస్యలు పరిష్కారం కాలేదని మరోసారి ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చినా సొంత ఉద్యోగులు వచ్చే పరిస్థితి ఉండదు. మొత్తానికి ఉద్యోగుల సమ్మె విషయంలో ప్రభుత్వానిదే పైచేయిగా నిలువగా ఉద్యోగ సంఘాల నేతలు డమ్మీలుగా మిగిలిపోయారనే కామెంట్స్ విన్పిస్తున్నాయి.

Also Read: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో జాబ్స్.. రూ.50 వేల వేతనంతో?