https://oktelugu.com/

Pushpa Movie: “పుష్ప” మూవీ కారణంగా హిందూపురంలో ఉద్రిక్తత… కారణం అదేనా

Pushpa Movie: అల్లు అర్జున్ పుష్ప సినిమా కారణంగా అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బన్నీ, సుకుమార్ కాంబినేషన్ లో  ఈరోజు విడుదల అవుతున్న సినిమా ‘పుష్ప’. కాగా ఈ సినిమా బెనిఫిట్ షో వేస్తామని చెప్పి బాలాజీ థియేటర్ యాజమాన్యం డబ్బులు వసూలు చేసిందని… అయితే బెనిఫిట్ షో వేయలేదంటూ అభిమానులు ఆందోళనకు దిగారు. బాలాజీ థియేటర్ యాజమాన్యం బెనిఫిట్ షో కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 500 వసూలు చేసిందని అభిమానులు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 17, 2021 / 11:04 AM IST
    Follow us on

    Pushpa Movie: అల్లు అర్జున్ పుష్ప సినిమా కారణంగా అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బన్నీ, సుకుమార్ కాంబినేషన్ లో  ఈరోజు విడుదల అవుతున్న సినిమా ‘పుష్ప’. కాగా ఈ సినిమా బెనిఫిట్ షో వేస్తామని చెప్పి బాలాజీ థియేటర్ యాజమాన్యం డబ్బులు వసూలు చేసిందని… అయితే బెనిఫిట్ షో వేయలేదంటూ అభిమానులు ఆందోళనకు దిగారు. బాలాజీ థియేటర్ యాజమాన్యం బెనిఫిట్ షో కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 500 వసూలు చేసిందని అభిమానులు ఆరోపించారు. ఈ మేరకు థియేటర్ వద్ద బోర్డు కూడా ఏర్పాటు చేశారని చెప్పారు.

    Pushpa Movie

    Also Read: ‘పుష్ప’కు అక్కడ మైనస్.. ఇక్కడ ప్లస్?

    అయితే శుక్రవారం ఉదయం సినిమా థియేటర్ వద్దకు వెళ్లిన అభిమానులకు నిరాశ ఎదురైంది. థియేటర్ యాజమాన్యం బెనిఫిట్ షో వేయకపోవడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. దీంతో పలువురు అభిమానులు థియేటర్‌పై రాళ్లు రువ్వారు. ఈ విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి అభిమానులను చెదరగొట్టారు. థియేటర్ గేట్లు మూసివేశారు. కాగా ఏపీలో బెనిఫిట్ షో లు వేయవద్దని ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ 35ను జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం హిట్ టాక్ తో దూసుకుపోతుంది.  షూటింగ్ ప్రారంభం నుంచి డైరెక్టర్ సుకుమార్ వదిలిన ప్రతి అప్‌డేట్ కూడా బాగా వైరల్ కావడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయింది. ఇక బన్నీ ఈ చిత్రంలో వన్ మ్యాన్ షో అని చేశారని…  పుష్పరాజ్‌గా  అదరగొట్టేశారని అంటున్నారు. ప్రస్తుతం మీడియా వ్యాప్తంగా పుష్ప మానియా నడుస్తుంది.

    Also Read: థియేటర్​లో ఫ్యామిలీతో పుష్పరాజ్​ సందడి.. ఎగబడిన అభిమానులు