D Srinivas: కాంగ్రెస్ పార్టీలో పలు పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీనియర్ల చేరికకు పార్టీ తివాచీలు పరుస్తోంది. ఇందులో భాగంగానే ఇన్నాళ్లు పార్టీని వీడిపోయిన వారిని తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్పటి పీసీసీ అధ్యక్షుడు డీఎస్ కొన్నాళ్లుగా టీఆర్ఎస్ లో కొనసాగుతున్నా అందులో ఇమడలేక మళ్లీ సొంత గూటికే చేరేందుకు నిర్ణయించుకున్నారు. తన అభిప్రాయాన్ని నేతలకు సూచించడంతో వారు సోనియాగాంధీ వద్ద ప్రస్తావించి డీఎస్ రాకను స్వాగతిస్తున్నారు.

మరోవైపు పార్టీలో వృద్ధుల భాగస్వామ్యం పెరిగిపోతోంది. దీంతో పార్టీకి ప్రయోజనాల కన్నా నష్టాలే ఎక్కువని చెబుతున్నారు. పార్టీకి జవసత్వాలు నింపేది యువకులే కానీ మసలి వారు కాదనే అభిప్రాయాలు సైతం వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీఎస్ చేరినా పెద్దగా ఒనగూడేది ఏదీ లేదని తెలుస్తోంది. దీంతో ఆయన చేరికపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.
అయితే ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలను ఢిల్లీ రావాల్సిందిగా అధిష్టానం సూచించింది. దీంతో వారిద్దరు డీఎస్ చేరికపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేఫథ్యంలో డీఎస్ చేరికతో పెద్దగా లాభాలేమి రావని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. యువతను చేర్చుకుంటే పార్టీని బలోపేతం చేసేందుకు దోహదపడతారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ లో ఇప్పటికే వృద్ధ తరం పెత్తనం సాగిస్తోంది. దీంతో పార్టీ బలోపేతం కాకుండా పోతోంది. రాష్ర్టంలో బీజేపీ క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపైనే ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో పార్టీని గట్టెక్కించాలంటే యువత అవసరం ఎక్కువగా ఉందనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతున్నా వృద్ధ నేతల కోసం ఎందుకు పాకులాడటం అనే ప్రశ్నలు సైతం వస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదనే వాదనలు వస్తున్నాయి.
Also Read: Industries: పరిశ్రమలు కోల్పోతున్న ఏపీ.. ఆహ్వానిస్తున్న తెలంగాణ
ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్ డీఎస్ కు మధ్య సఖ్యత కనిపించడం లేదు. దీంతో వారి మధ్య వైరం ఎక్కువగానే కనిపిస్తోంది. కేసీఆర్ తో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో డీఎస్ పార్టీ మారాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీతోనే తనకు మనుగడ ఉంటుందని డీఎస్ భావిస్తున్నట్లు చెబుతున్నారు ఇందులో భాగంగానే మళ్లీ కాంగ్రెస్ లో చేరేందుకు డీఎస్ సుముఖత వ్యకతం చేస్తున్నట్లు సమాచారం.