https://oktelugu.com/

కరోనా వేళ ఇవి చూసుకొని వాడండి

కరోనా టైంలో ప్రజలు చాలా వరకు హెల్త్‌ పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా అంటకుండా ఇంట్లోనే సెల్ఫ్‌ వైద్యం పొందుతున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఇమ్యునిటీ పవర్‌‌ పెంచుకోవడం.. ఆవిరి పట్టడం.. విటమిన్‌ టాబ్లెట్స్‌ వాడడం చేస్తున్నారు. ఈ మధ్య ప్రతి ఇంట్లోనే ఆవిరి పట్టే స్ర్టీమర్స్‌తోపాటు ఆక్సీమీటర్‌‌లు కనిపిస్తున్నాయి. ఈ ఆక్సీమీటర్‌‌ ద్వారా మన బాడీలోని ఆక్సిజన్‌ పల్స్‌ తెలుసుకోవచ్చు. దీని వాడకం మంచిదే. ఇవి మార్కెట్‌లో దొరుకుతుంటాయి. కానీ.. చాలా మంది వీటిని కొనలేక ఫోన్లలో […]

Written By:
  • NARESH
  • , Updated On : September 24, 2020 10:48 am
    Follow us on

    how to use oxymeter

    కరోనా టైంలో ప్రజలు చాలా వరకు హెల్త్‌ పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా అంటకుండా ఇంట్లోనే సెల్ఫ్‌ వైద్యం పొందుతున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఇమ్యునిటీ పవర్‌‌ పెంచుకోవడం.. ఆవిరి పట్టడం.. విటమిన్‌ టాబ్లెట్స్‌ వాడడం చేస్తున్నారు. ఈ మధ్య ప్రతి ఇంట్లోనే ఆవిరి పట్టే స్ర్టీమర్స్‌తోపాటు ఆక్సీమీటర్‌‌లు కనిపిస్తున్నాయి. ఈ ఆక్సీమీటర్‌‌ ద్వారా మన బాడీలోని ఆక్సిజన్‌ పల్స్‌ తెలుసుకోవచ్చు. దీని వాడకం మంచిదే. ఇవి మార్కెట్‌లో దొరుకుతుంటాయి. కానీ.. చాలా మంది వీటిని కొనలేక ఫోన్లలో యాప్‌ వేసుకుంటున్నారు. ఇది అస్సలు మంచిది కాదని హెచ్చరిస్తోంది కేంద్రం.

    Also Read: దెయ్యాల వాగు.. రాత్రయితే చాలు.. భరతనాట్యాలే?

    గుర్తు తెలియని యూఆర్‌‌ఎల్‌ల నుంచి ఆక్సీమీటర్‌‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుంటే అది మొదటికే మోసం అని చెబుతోంది. శరీరంలోని ఆక్సిజన్‌ లెవల్‌ ఎంతుందో చెప్పే యాప్‌లు నిజం కాదని తెలిపింది. అంతేకాదు.. ఇమేజ్‌లు, కాంటాక్టులు వంటి వ్యక్తిగత డేటానూ ఈ యాప్‌లు తస్కరిస్తాయని పేర్కొంది. యాప్‌కి బయోమెట్రిక్‌ ఫింగర్‌‌ ప్రింట్‌ని పెట్టి యూజర్‌‌కి చెందిన బయోమెట్రిక్‌ ఇన్ఫర్మేషన్‌ను కూడా లాగేస్తుందని హెచ్చరించింది.

    రక్తంలోని ఆక్సిజన్‌ లెవల్స్‌ని తెలుసుకునేందుకు చాలా మంది ఇలాంటి యాప్‌లను వాడుతున్నారు. అయితే.. ఆక్సిమీటర్లు వాడితేనే బాగుంటుందని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ ఆక్సిమీటర్లు ఈ–కామర్స్‌ వెబ్‌సైట్లలోనూ, మార్కెట్లలోనూ దొరుకుతున్నాయి.

    Also Read: ‘ భలే భలే మగాడివోయ్’ కంటే మతిపరుపు ప్రాణులున్నాయట.?

    ఒకవేళ యాప్‌లనే డౌన్‌లోడ్‌ చేసుకోవాలనుకుంటే కచ్చితంగా ఉన్న వాటినే గూగుల్‌ ప్లే స్టోర్‌‌ లేదా యాపిల్‌ ఆప్‌ స్టోర్‌‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. ఏదైనా ఎస్‌ఎంఎస్‌, ఈమెయిల్‌ లేదా సోషల్‌ మీడియాలో వచ్చే లింక్‌లను నమ్మొద్దని కేంద్రం స్పష్టం చేసింది.