ఏపీ రాజకీయాల్లో రోజుకో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే హిందూ దేవాలయాలపై దాడులు రాజకీయంగా దుమారం రేపుతుంటే.. అక్కడి మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న మంత్రులు ఇప్పుడు ఒక్కొక్కరుగా ఒక్కో స్టేట్‌మెంట్ ఇస్తుండడంతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఎప్పుడూ లేనిది ఇప్పుడే విమర్శలతో ఎందుకు విరుచుకుపడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.
Also Read: వివేకా హత్య కేసులో కీలక మలుపు… ఆ పంచాయతీ హత్యకు కారణమా..?
‘రాజధాని.. రాజధాని అంటారు.. అక్కడేముంది.. శ్మశానం తప్ప’ కొన్నాళ్ల కిందట బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలివి. అంతే ఇంకేముంది రాజకీయ దుమారం రేగింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మంత్రి కొడాలి నాని.. ‘రాజధాని ఎడారి. అక్కడ పశువులు తప్ప ఎవరూ లేరు’ అంటూ మాట్లాడుకొచ్చారు. దీంతో మళ్లీ పొలిటికల్‌గా హీటెక్కింది. ఇక ఇప్పుడు ‘ఆంజనేయుడి చెయ్యి విరిగింది బొమ్మకే కదా.. ఆంజనేయుడికి కాదు కదా? అంతర్వేది రథం తగలబడింది.. మహా అయితే కొత్త రథం చేయిస్తాం. దుర్గమ్మ వెండి సింహాలు మాయమయ్యాయి. వాటిని తీసుకెళ్లినోడు.. ఇళ్లు కట్టుకుంటాడా ?’ అంటూ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏపీలో రాజకీయ దుమారమే ప్రారంభమైంది.
ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. స్పీకర్ సీతారాంతో సహా చాలా మంది నాయకులు సమయం చూసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో రాజకీయ నేతలు కౌంటర్లతో రెచ్చిపోతున్నారు. అయితే.. ఇన్నాళ్లు ఏమీ మాట్లాడని ఏపీ మంత్రులు.. ఇప్పుడు ఇలా సంచలన కామెంట్లు చేయడం వెనుక రీజన్ ఏంటి..? కారణం లేకుండానే ప్రతిపక్షాలను రెచ్చగొడుతున్నారా? అన్నది అర్థం కాకుండా ఉంది.
Also Read: రైతులకు మోదీ శుభవార్త.. మరో 5 వేలు రైతుల ఖాతాల్లో జమ..?
ప్రతిపక్షాల చూపు మలిచేందుకే మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేది పలువురి ఆరోపణ. ఇటీవల ఏపీలో పెట్రోల్ ధరలు పెరిగాయి. తిరుమల డిక్లరేషన్ వివాదం నడుస్తూనే ఉంది. వీటి గురించి ప్రతిపక్షాలు నోరుమెదపకుండా ఏదో అంశం వదిలితే దానిపైన పడిపోతారని వీరి అభిప్రాయంలా కనిపిస్తోంది. అందుకే తప్పు మంత్రలుది కాదు.. ప్రతిపక్షాలదేనని పరిశీలకులు అంటున్నారు.