USA Angry Over India On Russia: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో పరిస్థితులు మారిపోతున్నాయి. అమెరికా ఉక్రెయిన్ కు మద్దతుగా అన్ని దేశాలను ఏకం చేసే పనిలో భాగంగా అన్ని దేశాలను తనవైపుకు తిప్పుకుంటోంది అమెరికా. ఇందులో భాగంగా భారత్ ను కూడా తన వైపు తిప్పుకోవాలని భావిస్తున్నా ఇండియా మాత్రం ససేమిరా అంటోంది. దీంతో రష్యా విదేశాంగ మమంత్రి సెర్గీ లవ్రోవ్ దేశంలో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భారత్ వైఖరి సమంజసం కాదని చెబుతోంది. భారత్ రష్యా సంబంధాలపై అమెరికా కలవరపడుతోంది.

ఉక్రెయిన్ పై యుద్ధం విషయంలో భారత్ అనుసరిస్తున్న వైఖరి సరిగా లేదని అమెరికా విమర్శిస్తోంది. రష్యాపై అమెరికా విధించే ఆంక్షలు నిర్వీర్యం చేసే దేశాలపై అమెరికా జాతీయ భద్రత ఉప సలహాదారు దలీప్ సింగ్ హెచ్చరికలు చేసిన ఖాతరు చేయడం లేదు. దీంతో లవ్రోవ్ కేంద్ర మంత్రి జైశంకర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపధ్యంలో అమెరికా పాత్రపై భారత్ మాత్రం ఏమాత్రం లెక్క చేయడం లేదు. ఉక్రెయిన్ పై యుద్ధం మానుకోవాలని డిమాండ్ చేయాలని ఇండియాను కోరుతున్నా పట్టించుకోవడం లేదు.
భారత్, రష్యా సంబంధాలపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పెట్రో ఉత్పత్తుల కోసం రష్యాపై ఆధారపడుతూ ఇండియా వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోందని విమర్శిస్తోంది. యుద్ధం వద్దంటూ రష్యాకు చెప్పాల్సింది పోయి ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం ఏమిటని ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలో ఇండియా, రష్యా బంధంపై అమెరికా తనదైన శైలిలో విమర్శల దాడికి దిగుతోంది. ఉక్రెయిన్ కు మద్దతు తెలపాల్సింది పోయి రెచ్చగొట్టే విధంగా రష్యాతో సంబంధం పెట్టుకోవడంపై అగ్రరాజ్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

రష్యా, ఉక్రెయిన్ ఘర్షణలకు త్వరలో ముగింపు పలకాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షిస్తున్నా బయటకు మాత్రం ఎలాంటి పాత్ర పోషించడం లేదు. ఉక్రెయిన్ పరిస్థితిని లవ్రోవ్ కు మోడీ వివరించినా అందులో పెద్దగా పురోగతి మాత్రం కనిపించదు. ఇవన్ని తెలిసినా ఎందుకు అమెరికా ఇంత రాద్ధాంతం చేస్తోందనే వాదనలు కూడా వస్తున్నాయి. దీనిపై అమెరికా ఇంత పెద్దగా ఎందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం త్వరగా సమసిపోవాలని కోరుకుంటున్నా అవి జరుగుతాయా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
[…] Rashmika Mandanna: అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ దర్శకుడిగా మారిన సందీప్ వంగ.. బాలీవుడ్‌లో రణబీర్ కపూర్‌తో ‘యానిమల్’ సినిమాను చేస్తున్నాడు. పైగా క్రియేటివ్ డైరెక్టర్ అనే పేరుతో పాటు బోల్డ్ డైరెక్టర్ గా అనే పేరును కూడా నేషనల్ రేంజ్ లో తెచ్చుకున్నాడు. మొత్తానికి ఒక్క సినిమానే రెండుసార్లు తీసి నేషనల్ డైరెక్టర్ రేంజ్ గుర్తింపు తెచ్చుకోవడం ఒక్క సందీప్ రెడ్డికే సాధ్యం అయింది. […]