NTR New Makeover: ఎన్టీఆర్ కొమురం భీముడిగా స్క్రీన్ మీద నిండుగా కనిపించడం కోసం లావు పెరిగారు. ఎన్టీఆర్ అరవింద సమేతలో చాలా స్లిమ్ గా కనిపించారు. అంతకుముందు జనతాగ్యారేజ్‌లో కాస్త బొద్దుగా కనిపించారు. మొత్తానికి సినిమా సినిమాకీ తారక్ తన బాడీని మార్చుకుంటూ పాత్రకి తగ్గట్టు తనను తాను మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇక ప్రస్తుతం ఎన్టీయార్ డైరెక్టర్ కొరటాల శివతో మరో సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా కోసం తారక్ కొత్త మేకోవర్ పనుల్లోనే బిజీగా ఉన్నాడు. రెండునెలల్లోగా కనీసం ఎనిమిది కిలోలైనా తగ్గాలని టార్గెట్ గా పెట్టుకుని కసరత్తులు చేస్తున్నాడు. ఎంతైనా ఈ సినిమా కోసం ఎన్టీఆర్, తనకిష్టమైన త్రివిక్రమ్ సినిమాను కూడా వదులుకున్నాడు. కొరటాల చెప్పిన కథ, ఎన్టీఆర్ కి అంత గొప్పగా నచ్చింది. అందుకే.. ఈ సినిమా కథ కోసం తాను 8 కేజీలు తగ్గాలని కసరత్తులు చేస్తున్నాడు. ఇందుకోసం స్పెషల్ ట్రైనర్‌ను సైతం రిక్రూట్ చేసుకున్నాడట.
ఈ సినిమాలో తారక్ లుక్ చాలా స్టైలిష్‌గా ఉంటుందని తెలుస్తోంది. జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. అన్నట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా కూడా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని ఒప్పించాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఆ విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు అయితే.. సినిమా మార్కెట్ కి ఇంకా బాగా ఉపయోగపడుతుంది అని కొరటాల కూడా ఫీల్ అవుతున్నాడు.
ఎందుకంటే ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కు హిందీలో కూడా మంచి మార్కెట్ క్రియేట్ అయ్యింది. మరి కొరటాల హిందీలో ఏ స్టార్ హీరోని ఒప్పిస్తాడో చూడాలి. కాగా సుధాకర్ మిక్కిలినేని, కళ్యాణ్ రామ్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
కాగా ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ సెట్స్ కూడా వేసారు. పైగా జూబ్లీహిల్స్ లోని ఎన్టీఆర్ ఇంటి పక్కనే ఓ పెద్ద సెట్ వేశారు. సినిమాలో ఎక్కువ భాగం ఈ సెట్ లోనే ఉంటుందట. ఎన్టీఆర్ కి చాలా టైం కలిసివస్తుందని కొరటాల శివనే స్వయంగా ఇలా అక్కడ సెట్ వేశామని చెప్పుకొచ్చాడు.