US Visa
US Visa : అగ్రరాజ్యం అమెరికా అంటే ప్రపంచ వ్యాప్తంగా ఒక క్రేజ్. ఆ దేశంలో చదువుకోవాలని, ఉద్యోగాలు చేయాలని ఏటా వివిధ దేశాల నుంచి వేల మంది వెళ్తుంటారు. ఇందుకు స్టూడెంట్, ఎప్లాయ్‌మెంట్ వీసాలు జారీ చేస్తుంది. అయిటే ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక పాలన తీరు మారింది. భారత్‌లోని అమెరికా(America) దౌత్య కార్యాలయం బుధవారం ఒక కీలక ప్రకటన చేసింది. మోసపూరిత కార్యకలాపాల కారణంగా 2 వేల వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేసినట్లు తెలిపింది. ఈ అపాయింట్‌మెంట్లు ‘బాట్స్’ ద్వారా బుక్ చేయబడినవని, షెడ్యూలింగ్(Schedyullong) వ్యవస్థలో భారీ లోపం గుర్తించామని వెల్లడించింది. ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, ‘భారత్‌లోని కాన్సులర్ బందం బాట్స్ ద్వారా జరిగిన 2 వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేస్తోంది. మా విధానాలను ఉల్లంఘించే ఏజెంట్లు, ఫిక్సర్లను సహించము. ఈ అపాయింట్‌మెంట్లను రద్దు చేస్తూ, సంబంధిత ఖాతాల షెడ్యూలింగ్ అధికారాలను సస్పెండ్ చేస్తున్నాం. మోసాల నిర్మూలనకు మా కషి కొనసాగుతుంది‘ అని పేర్కొంది.
Also Read : విదేశీ విద్యార్థుల కలలకు ట్రంప్ గండి.. అమెరికా F–1 వీసాల కోత..
సుధీర్ఘకాలం వేచి ఉండాల్సిందే..
అమెరికా బిజినెస్ (బీ1), విజిటర్ (బీ2), స్టూడెంట్ వీసాలకు అపాయింట్‌మెంట్ల కోసం సుదీర్ఘ వేచి ఉండాల్సి ఉంటుంది. అయితే, ఏజెంట్లకు రూ.30 వేల నుంచి రూ.35 వేలు చెల్లిస్తే నెలలోపే స్లాట్ లభిస్తుందన్నది పర్యాటక రంగంలో బహిరంగ రహస్యం. ఓ వ్యక్తి తమ కుమారుడి విశ్వవిద్యాలయ ప్రవేశానికి సొంతంగా అపాయింట్‌మెంట్ పొందలేక, ఏజెంట్‌కు రూ.30 వేలు చెల్లించి వెంటనే స్లాట్ సంపాదించినట్లు వెల్లడించాడు. సాధారణంగా సొంతంగా దరఖాస్తు చేస్తే సమీప భవిష్యత్తులో స్లాట్లు దొరకవు. ఏజెంట్లు బాట్స్ ఉపయోగించి స్లాట్లను బ్లాక్ చేస్తారు. 2023లో బీ1, బీ2 వీసాల వేచి ఉండే సమయం 999 రోజులకు చేరింది. దీంతో భారతీయ దరఖాస్తుదారుల కోసం అమెరికా ఫ్రాంక్‌ఫర్ట్, బ్యాంకాక్‌లలో అపాయింట్‌మెంట్లను తెరిచింది.
పారదర్శకత కోసం..
మూడేళ్ల క్రితం భారత్ ప్రభుత్వం ఈ సమస్యను అమెరికా దృష్టికి తీసుకెళ్లగా, వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గింది. ఇప్పుడు బాట్స్ వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ఈ రద్దు నిర్ణయం వీసా ప్రక్రియలో న్యాయం, పారదర్శకతను నిర్ధారించే దిశగా అడుగుగా భావిస్తున్నారు. ఏజెంట్లు బాట్స్ ద్వారా స్లాట్లను ఆక్రమించడం వల్ల సామాన్య దరఖాస్తుదారులు నష్టపోతున్నారు. అమెరికా దౌత్య కార్యాలయం ఈ చర్యలతో మోసాలను అడ్డుకుని, వీసా వ్యవస్థ సమగ్రతను కాపాడాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read : దొరకని అమెరికా వీసా ..తెచ్చిన లోన్లకు పెరుగుతున్న వడ్డీలు.. తీవ్ర ఇబ్బందుల్లో స్టూడెంట్స్
Web Title: Us visa india appointments canceled
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com