US F-1 Visa
US F-1 Visa: రెండు నెలలుగా సంచలన నిర్ణయాలతో ఇటు అమెరికన్లను అటు ప్రపంచ దేశాలను భయపెడుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తన 2.0 పాలనలో సంచనల నిర్ణయాలు తీసుకుంటున్నారు. దూకుడు ప్రదర్శిస్తున్నారు. అక్రమ వలసలనపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
Also Read: ఎంపీల జీతాలు పెరిగినయ్.. అమలు ఎప్పటి నుంచంటే..
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ 2.0 పాలనలో దూకుడు, స్పీడ్‌తో ప్రపంచ దేశాలతోపాటు అమెరికన్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఖర్చు తగ్గింపు పేరుతో అమెరికన్లను, మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ పేరుతో విదేశీయులను ఇబ్బంది పెడుతున్నాడు. అక్రమ వలసదారులను దేశం దాటిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం చేశారు. ఇక ఇప్పుడు వీసాల్లో కోత పెడుతున్నారు. తాజాగా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనే కల చాలామంది విద్యార్థుల సొంతం. అందులోనూ అమెరికా వంటి అగ్రరాజ్యంలో చదువుకోవాలని ఆశపడేవారు ఎక్కువ. ఏటా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ లక్ష్యంతో అమెరికా బాట పడుతుంటారు. అయితే, గత కొంతకాలంగా అమెరికా ప్రభుత్వం విద్యార్థి వీసాలు (F–1)పై కఠిన వైఖరి అవలంబిస్తూ వీసా జారీల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 41% వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి, ఇది గత దశాబ్దంతో పోలిస్తే దాదాపు రెట్టింపు.
పెరుగుతున్న తిరస్కరణ..
అమెరికా విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం, 2023–24లో 6.79 లక్షల F–1 వీసా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 2.79 లక్షలు (41%) తిరస్కరించబడ్డాయి. 2022–23లో 6.99 లక్షల దరఖాస్తుల్లో 2.53 లక్షలు (36%) ఆమోదం పొందలేదు. దీనికి భిన్నంగా, 2013–14లో 7.69 లక్షల దరఖాస్తుల్లో 1.73 లక్షలు (23%) మాత్రమే తిరస్కరణకు గురయ్యాయి. ఈ గణాంకాలు వీసా తిరస్కరణ రేటు గత పదేళ్లలో రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగిందని స్పష్టం చేస్తున్నాయి.
భారతీయులపైనా ప్రభావం..
భారతీయ విద్యార్థుల విషయంలోనూ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 2024 తొలి 9 నెలల్లో F–1 వీసాల జారీ 38% తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జనవరి నుంచి సెప్టెంబరు వరకు కేవలం 64 వేల మందికి వీసాలు మంజూరయ్యాయి, అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 1.03 లక్షలుగా ఉంది. కొవిడ్ తర్వాత భారతీయ విద్యార్థులకు వీసాలు ఇంతగా తగ్గడం ఇదే మొదటిసారి.
F–1 వీసా అంటే ఏమిటి?
ఇది నాన్–ఇమిగ్రెంట్ వీసా, అమెరికాలో ఫుల్–టైమ్ విద్య కోసం విదేశీ విద్యార్థులకు అనుమతినిస్తుంది. అమెరికా విద్యాసంస్థలు ఏటా రెండు సెమిస్టర్‌లలో (ఆగస్టు–డిసెంబర్, జనవరి–మే) ప్రవేశాలు కల్పిస్తాయి. భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఆగస్టు సెమిస్టర్‌లో వెళ్తారు. అయితే, కఠిన వీసా విధానాలతో ఈ కలలు కల్లలవుతున్నాయి. ఈ తిరస్కరణల వెనుక అక్రమ వలసలను అరికట్టడం, వీసా నిబంధనలను కఠినతరం చేయడం వంటి కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో, విద్యార్థులు ఆర్థిక స్థిరత్వం, సరైన డాక్యుమెంటేషన్, చదువు తర్వాత స్వదేశం తిరిగి వెళ్లే హామీని స్పష్టంగా చూపించాల్సి వస్తోంది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
View Author's Full InfoWeb Title: Us f 1 visa trump foreign students visa cuts