US Inflation.: నిత్యావసరాల ధరల పెరుగుదల.. పెరిగిన పెట్రోల్ ధరలు.. పైకి ఎగబాకిన ద్రవ్యోల్భణ సూచి.. ఇవి మనదేశంలోని పరిస్థితులు కాదు.. అమెరికాలో ఇప్పుడు ఊహించని స్థాయిలో ధరలు పెరుగుతున్నాయి. నిత్యావసరాలతో పాటు రవాణా, తదిర చార్జీలు విపరీతంగా పెరిగాయి. దీంతో ప్రజల జీవన వ్యయం భారంగా మారిపోతుంది. కరోనా కారణంగా ఇప్పటికే ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్న అమెరికాలో ఇప్పుడు ద్రవ్యోల్భణంతో మరింత కుంగిపోతున్నారు. గత ఏప్రిల్ లో కొంత మేర వార్షిక ద్రవ్యోల్భణం తగ్గినా.. మే నెలలో మాత్రం 8.6 శాతానికి పెరిగిందని లేబర్ డిపార్ట్ మెంట్ తెలిపింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలోకి తేవాల్సిన అవసరం ఉందని విధాన కర్తలు సూచిస్తున్నారు.
ధరల పెరుగుదలకు రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరిగిన యుద్ధమే కారణమని తెలుస్తోంది. ఈ రెండు దేశాల నుంచి వస్తువుల దిగుమతి నిలిచిపోవడంతో ఆహార వస్తువుల కొరత తీవ్రంగా ఏర్పడింది. దీంతో వస్తువుల ధరలు అధికంగా పెరిగాయి. 2011 మే నెలతో పోలిస్తే గత నెలలో 10 శాతానికి పైగా పెరిగాయి. ఇక ఇంధన ధరలైతే 34 శాతానికి పెరిగినట్లు తెలుస్తోంది. ఆహార వస్తువులు, పెట్రోల్ ధరలే కాకుండా రవాణా చార్జీలు విపరీతంగా పెరిగాయి. విమాన టిక్కెట్లు మొదలుకొని అన్ని రకాల వాహన చార్జీలను పెంచేశారు. ద్రవ్యోల్భణ వార్షిక పెరుగుదల రేటు 8.6 శాతం నమోదైంది. 1981 తరువాత మళ్లీ ఆ స్థాయిలో ద్రవోల్భణం ఏర్పడిందని బ్యాంక్రెట్ డాట్ కామ్ అనే వెబ్ సైట్ తెలిపింది. అయితే ఈ వస్తువులు పెరుగుదల ప్రభావం మిగతా వాటిపై పడుతున్నాయని అంటున్నారు.
ధరల పెరుగుదలతో ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. దీంతో సామాన్యులు ఖర్చు చేయడానికి వెనుకాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో దేశం ఆర్థికంగా తిరోగమించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం కారణమే కాకుండా చైనా లాక్డౌన్ తో ప్రజా పంపిణీ వ్యవస్థ మందగించడం లాంటికారణాలు అమెరికా ద్రవ్యోల్భణానికి కారణమవుతున్నాయి. ఇదిలా ఉండగా ద్రవ్యోల్భణ సూచి నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. 2 శాతానికిపైగా స్టాక్ మార్కెట్ల సూచిలు పడిపోయాయి. ఇప్పట్లో తక్షణ చర్యలు తీసుకోకపోతే ద్రవ్యోల్భణం తగ్గే స్థాయి కనిపించడం లేదని అంటున్నారు.
అయితే ధరలు ఓ వైపు వేగంగా పెరుగుతున్న కార్మికుల వేతనాలు పెరగడం లేదు. దీంతో అల్పాదాయ వర్గాలు నిత్యావసరాలు తప్ప మిగతా వాటిపై ఎక్కువగా ఖర్చు చేయడం లేదు. నిత్యావసరాల ధరలు కూడా విపరీతంగా ఉండడంతో వాటి కొనుగోలుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో ద్రవ్యోల్భణం పెద్ద సమస్యగా మారిందని, దీనిపై అధ్యక్షుడు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయనపై పలు విమర్శలు వస్తున్నాయి.