Ante Sundaraniki Collections: 31 కోట్ల రూపాయల టార్గెట్ తో బరిలోకి దిగిన నాని బాక్సాఫీస్ వద్ద తడబడుతున్నాడు. అంటే సుందరానికీ ఏమాత్రం అంచనాలు అందుకునేలా కనిపించడం లేదు. అంటే సుందరానికీ వసూళ్లు నిరాశాజకంగా సాగుతున్నాయి. రెండో రోజు అంటే సుందరానికీ చిత్రం పర్వాలేదు అనిపించింది. అయినప్పటికీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడం గగనమే అంటున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పెట్టుబడి రాబట్టడం కష్టమే.
దర్శకుడు వివేక్ ఆత్రేయ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా అంటే సుందరానికీ మూవీ తెరకెక్కించారు. ఫస్ట్ షో నుండే చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. నాని, నజ్రియా నటనకు ప్రశంసలు దక్కాయి. వాళ్ళ కెమిస్ట్రీ బాగా కుదిరింది. కామెడీ కూడా వర్క్ అవుట్ కావడంతో ఆడియన్స్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. మూవీ నిడివి ఎక్కువైందన్న ఒక్క మైనస్ తప్ప మొత్తంగా సినిమా బాగుందన్న మాట వినిపించింది. దీంతో సినిమా భారీ హిట్ కొడుతుందని మేకర్స్ భావించారు.
Also Read: Poonam Bajwa: రెచ్చిపోయిన బన్నీ హీరోయిన్.. పొట్టిలాగు ధరించి బీచ్ లో అలాంటి ఫోజులు!
బాక్సాఫీస్ వద్ద మాత్రం సినిమా టాక్ కి కలెక్షన్స్ కి సంబంధం లేదు. యావరేజ్ ఓపెనింగ్స్ దక్కించుకున్న అంటే సుందరానికీ ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చింది. అయితే శనివారం పర్వాలేదు అనిపించింది. సాధారణంగా రెండో రోజు ఎంతో కొంత డ్రాప్ కనిపిస్తుంది. అంటే సుందరానికీ ఫస్ట్ డే కలెక్షన్స్ తో సమానంగా రెండో రోజు కూడా రాబట్టింది. అయితే టార్గెట్ ఎక్కడో ఉండగా.. ఈ వసూళ్లు సరిపోవు. విక్రమ్, మేజర్ చిత్రాల నుండి ఈ మూవీ గట్టి పోటీ ఎదుర్కొంటుంది. వేసవి సెలవులు కూడా ముగియగా… వీక్ డేస్ లో ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడం కష్టమే.
ఇక ప్రాంతాల వారీగా వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం. నైజాంలో రెండు రోజులకు గాను అంటే సుందరానికీ చిత్రం రూ. 2.95 కోట్ల షేర్ రాబట్టింది. సీడెడ్ లో రూ. 0.75 కోట్లు రాబట్టింది. ఇక ఉత్తరాంధ్రలో రూ. 0.82 కోట్లు వసూలు చేసింది. రెండు రోజులకు ఏపీ/తెలంగాణాలో కలిపి రూ.7 కోట్ల షేర్ రూ. 11 కోట్ల గ్రాస్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా రూ. 10.44 కోట్ల షేర్ అందుకుంది. అంటే సుందరానికీ మూవీ రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 31 కోట్ల షేర్ రాబట్టాలి.
ఏరియా వైజ్ అంటే సుందరానికీ మూవీ రెండు రోజుల వసూళ్ల వివరాలు…
నైజాం రూ. – 2.95 కోట్లు
సీడెడ్ రూ – .0.75 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.82 కోట్లు
ఈస్ట్ – రూ. 0.60 కోట్లు
వెస్ట్ – రూ. 0.54 కోట్లు
గుంటూరు– రూ. 0.55 కోట్లు
కృష్ణా – రూ. 0.51 కోట్లు
నెల్లూరు – రూ. 0.32 కోట్లు
ఏపీ & తెలంగాణ – రూ 7.04 కోట్లు
కర్ణాటక & రెస్టాఫ్ ఇండియా – రూ.0.60 కోట్లు
ఓవర్సీస్ – రూ.2.80 కోట్లు
వరల్డ్ వైడ్ – రూ. 10.44 కోట్లు
Also Read:Virata Parvam: విరాటపర్వం నుండి క్రేజీ అప్డేట్.. రానా పాడితే ఎలా ఉంటుందో చూడండి!