Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి పరిశ్రమలో సౌమ్యుడు, వివాదరహితుడిగా పేరుంది. ఇక పబ్లిక్ లో చిరంజీవి కోప్పడ్డ సందర్భాలు కూడా చాలా తక్కువ. కాగా ఈ మధ్య ఓ షోకి గెస్ట్ గా వెళ్లిన చిరంజీవి తీవ్ర అసహనానికి గురయ్యారట. ఏకంగా ఆ షో పూర్తి కాకుండానే మధ్యలో వాక్ అవుట్ చేశారట. యాంకర్ చేసిన ఓ తప్పిదం ఆయన ఆవేశానికి కారణమైందట. షో షూట్ జరుగుతుండగా యాంకర్ స్పాన్సర్స్ పేరు తప్పుగా చదివారట. దానితో చిరంజీవితో పాటు యాంకర్ ని మరో టేక్ చేయాలని షో డైరెక్టర్ కోరారట.
ఆ పరిణామం చిరంజీవి సహనం కోల్పోయేలా చేసిందట. షో పూర్తి చేయకుండానే మధ్యలో లేచి వెళ్లిపోయారట. చిరంజీవి చర్యతో అక్కడ ఉన్నవారంతా షాక్ తిన్నారట. అంత పెద్ద హీరోకి సర్ది చెప్పడం ఎవరి వల్ల కాదు కాబట్టి, అందరూ అలా చూస్తూ ఉండిపోయారట. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. చిరంజీవి హాజరైన ఆ షో ఏంటీ? ఎక్కడ, ఎప్పుడు జరిగింది? అనే విషయంపై స్పష్టమైన సమాచారం లేదు.
Also Read: Ante Sundaraniki Collections: రెండో రోజు అంటే సుందరానికి కలెక్షన్స్ పరిస్థితి ఏంటీ?
ఇక ఆచార్య మూవీ రిజల్ట్ తో చిరంజీవి బాగా డిస్టర్బ్ అయ్యారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఆచార్య డిజాస్టర్ గా నిలిచింది. బయ్యర్లకు కొంత మేర నష్టాలు చిరంజీవి చెల్లించారు. ఇక ఇటీవల ఆయన విదేశాల నుండి ఇండియాకి తిరిగి వచ్చారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా మూడు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. దర్శకుడు మెహర్ రమేష్ భోళా శంకర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్.
అలాగే దర్శకుడు బాబీతో మెగా154 తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. అలాగే మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ మూవీ చేస్తున్నారు. మలయాళ చిత్రం లూసిఫర్ కి ఇది అధికారిక రీమేక్. గాడ్ ఫాదర్ మూవీలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేయడం విశేషం. ఆయనపై ఓ ఫైట్, సాంగ్ కూడా షూట్ చేశారట. చిరంజీవి అప్ కమింగ్ చిత్రాలపై భారీ హైప్ నెలకొని ఉంది. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో కూడా చిరంజీవి ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు.
Also Read:Poonam Bajwa: రెచ్చిపోయిన బన్నీ హీరోయిన్.. పొట్టిలాగు ధరించి బీచ్ లో అలాంటి ఫోజులు!