Pooja Khedkar: దేశంలో సంచలనం ఆరోపణలు ఎదుర్కొంటోంది ఐఏఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్. తపుపడు ధ్రువీకరణ పత్రాలతో ఆమే సివిల్స్‌లో రిజర్వేషన్ పొందారని అరోపణలు వచ్చాయి. క్రిమీలేయర్ విషయంలోనూ పూజ తప్పుడు పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన అధికారాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణతో తొలగించబడిన మాజీ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తనపై చర్య తీసుకునే అధికారం లేదని పేర్కొంటూ, ఆమె అనర్హతను సవాలు చేసింది. ప్రస్తుతం ఆమె కేసు దిల్లీ హైకోర్టులో ఉంది. కోర్టు విచారణలో యూపీఎస్సీ చేసిన ఆరోపణలను పూజ ఖండించారు. తాను ఎటువంటి ఫోర్జరీ పత్రాలను సమర్పించలేదని ఆమె వాదించారు. తనపై అనర్హత వేటు వేయడానికి యూపీఎస్సీకి అధికారం లేదని తెలిపింది. అఖిల భారత సర్వీసుల చట్టం కింద చర్యలు తీసుకునే హక్కు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్‌కు మాత్రమే ఉందని పూజ కోర్టులో వాదించారు.
సర్వీస్ నుంచి తొలగింపు..
పూజా ఖేద్కర్ తప్పుడు ధ్రువపత్రాలతో సివిల్స్‌లో రిజర్వేషన్ పొందినట్లు నిరూపణ కావడంతో జూలై 31న యూపీఎసీ ఖేద్కర్ తాత్కాలిక అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. భవిష్యత్తులో ఎలాంటి పరీక్షలు లేదా ఎంపికలలో హాజరుకాకుండా ఆమెను నిషేధించింది. ఖేద్కర్ తన అధికారాలను దుర్వినియోగం చేసినందుకు, సీఎస్‌ఈ (సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్) 2022 నియమాల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు దోషిగా తేలింది. తన గుర్తింపును నకిలీ చేయడంతో సహా ఈ నిర్ణయం తీసుకుంది.
ఇంటి పేరులో మార్పు లేదు..
దరఖాస్తుదారుడి మొదటి పేరు, ఇంటిపేరులో ఎటువంటి మార్పు లేదు, 2012 నుండి 2022 వరకు, అన్ని డీఏఎఫ్‌లలో స్థిరంగా ప్రతిబింబిస్తుంది. యూపీఎస్‌సీ 2019, 2021, 2022 వ్యక్తిత్వ పరీక్షల సమయంలో సేకరించిన బయోమెట్రిక్ డేటా (సై మరియు వేలిముద్రలు) ద్వారా ఆమె గుర్తింపును «ధ్రువీకరించింది. 2022, మే 26న వ్యక్తిత్వ పరీక్ష సమయంలో కమిషన్ అన్ని పత్రాలను ధ్రువీకరించింది. పూజా ఖేద్కర్, 2020–21 వరకు, ’పూజా దిలీప్రావ్ ఖేద్కర్’ పేరుతో ఓబీసీ కోటా కింద పరీక్షకు హాజరయ్యారు. 2021–22లో, అన్ని ప్రయత్నాలను ముగించి, ఆమె ఓబీసీ, పీడబ్ల్యూబీడీ(బెంచ్‌మార్క్ వికలాంగులు) కోటాల క్రింద పరీక్షకు హాజరయింది. ఈసారి ’పూజ మనోరమ దిలీప్ ఖేద్కర్’ పేరును ఉపయోగించారు. ఆమె పరీక్షలో 821 ర్యాంక్‌తో ఉత్తీర్ణత సాధించింది.