దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ర్టంగా ఉత్తరప్రదేశ్ కొనసాగుతోంది. దీనికి అధికార బీజేపీ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే జననాలను కట్టడి చేయాలని భావిస్తోంది. ముస్లిం జనాభా అధికంగా ఉండే అస్సాంలో ఇప్పటికే ఈ ప్రయత్నాలను ఆరంభించిన బీజేపీ ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో ఇద్దరు పిల్లల విధానాన్ని ప్రవేశపెట్టింది. జనాభా నియంత్రణలో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బిల్లును సిద్ధం చేసింది. ఆ రాష్ర్ట లా బోర్డు రూపొందించిన బిల్లు ముసాయిదాలోని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఉత్తర ప్రదేశ్ పాపులేషన్ (నియంత్రణ,స్థిరీకరణ, సంక్షేమ యాక్ట్-2021 తొలి ముసాయిదాను ఈనెల 11న ప్రపంచ దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని యోగి సర్కారు భావిస్తోంది. ఇద్దరు లేదా అంతకంటే తక్కువ మంది పిల్లలు ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలుంటే సదరు వ్యక్తులకు ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రోత్సాహకాలు లభించవు. ఈ నెల 11న విడుదల కానున్న ముసాయిదాపై 10 రోజుల్లోగా ప్రజలుస్పందన తెలపాలని యూపీ స్టేట్ లా కమిషన్ కోరనుంది.
చైనా తరహాలో ఇద్దరు పిల్లల విధానాన్ని ప్రోత్సహించిన యోగి సర్కారు నిబంధనలు పాటించిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. స్వచ్ఛందంగా కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికి సాధారణ వడ్డీతో ఇళ్ల నిర్మాణం కోసం రుణాలు, నీరు, విద్యుత్, ఇంటి పన్నుల్లో రిబేట్ ఇస్తారు. ఒక బిడ్డ తరువాత ఆపరేషన్ చేయించుకుంటే ఉచిత ఆరోగ్య సదుపాయాలు, 20 ఏళ్లు వచ్చే వరకు బీమా, ఐఐఎం, ఎయిమ్స్ లాంటి విద్యాసంస్థల్లో సులువుగా అడ్మిషన్ లభిస్తుందని తెలిపారు.
సీఎం ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభాను పరిమితం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. జనాభా నియంత్రణకు కమ్యూనిటీ సెంట్రిక్ అప్రోచ్ ఉ:డాలని పిలుపునిచ్చార. జనాభా పెరగడానికి పేదరికం, నిరక్షరాస్యతలే కీలకం అన్నారు. ఇందుకోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం గురించి చెప్పారు. లేకపోతే దేశం అధోగతి పాలవుతుందని పేర్కొన్నారు.