Punjab Elections: వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో జరిగే అయిదు స్టేట్ల ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటనుంది. ఈ మేరకు ఏబీసీ సీ ఓటర్ సర్వే వివరాలు వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, గోవా, జార్ఖండ్, మణిపూర్, పంజాబ్ స్టేట్లలో 2022 లో జరిగే ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలు విజయం సాధిస్తాయని చెబుతోంది. దీంతో కమలనాథుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కానీ యూపీలో బీజేపీ 100 సీట్ల వరకు కోల్పోయే అవకాశం ఉందని చెప్పింది.

పంజాబ్ రాష్ర్టంలో బీజేపీ, దాని మిత్ర పక్షాలకు సీట్లు రావడం కష్టమేనని తెలుస్తోంది. పంజాబ్ లో అమ్ ఆద్మీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని తెలిపింది. ఉత్తరప్రదేశ్ లో మాత్రం మళ్లీ అధికారం బీజేపీదే అని తెలుస్తోంది. బీజేపీ కూటమి 217 సీట్లలో విజయం సాధిస్తుందని సర్వే వెల్లడించింది. సమాజ్ వాదీ పార్టీకి 156, బీఎస్పీకి 18, కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు మాత్రమే దక్కనున్నట్లు సమాచారం.
పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీకి 46, ఎస్ ఏడీకి 20, ఏఏపీ (ఆప్) కి 51 స్థానాలు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 34.9 శాతం ఓట్లు, ఎస్ ఏడీకి 20.6 శాతం, అమ్ ఆద్మీ పార్టీకి 36.5 ఓట్లు, బీజేపీకి 2.2 శాతం ఓట్లు రానున్నాయని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ,కి 42-50 మధ్య, అమ్ ఆద్మీ పార్టీకి 47-53 మధ్య సీట్లు వస్తాయని తెలిపింది.
ఉత్తరాఖండ్ రాష్ర్టంలో బీజేపీ అధికారం సాధిస్తుందని తెలుస్తోంది. ఇక్కడ 38 సీట్లు సాధించి అధికారం హస్తగతం చేసుకుంటుందని సమాచారం. కాంగ్రెస్ పార్టీకి 32, ఇతరులకు ఒక స్థానం దక్కే వీలుంది. బీజేపీకి 41.1 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 36.3 శాతం ఓట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 11.8 ఓట్లు వస్తాయని పేర్కొంది.
ఇక గోవాలో కూడా బీజేపీ తన హవా కొనసాగించనుంది. బీజేపీ 21 స్థానాలు దక్కించుకుని అతిపెద్ద పార్టీగా నిలవనుంది. అమ్ ఆద్మీ పార్టీ 5, కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీకి 35.7 శాతం ఓట్లు, అమ్ ఆద్మీ పార్టీకి 23.6 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 18.6 శాతం ఓట్లు రానున్నట్లు తెలిపింది.
మణిపూర్ రాష్ర్టంలో కూడా బీజేపీ తన తడాఖా చూపనుంది. బీజేపీకి 25-29 సీట్లు దక్కే సూచనలున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 20-24, పీపుల్స్ ఫ్రంట్ కు 4-8 స్థానాలు, ఇతరులకు 3-7 స్థానాలు దక్కే వీలుంటుంది. 60 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీకి 38.7 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 33.1 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: ఏపీ ఉద్యోగుల పరిస్థితి అధ్వానం.. నేతల్లో మాత్రం వెటకారం
పీఆర్సీ అమలులో జాప్యం ఎందుకు.? ఉద్యోగ సంఘాల్లో చీలిక ఎలా మొదలైంది.?