Gopichand malineni: నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని ప్రతిష్టాత్మకంగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. శనివారం ఈ సినిమా లాంచనంగా షూటింగ్ ప్రారంభించింది. ఈ క్రమంలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించింది చిత్రబృందం. పూజా కార్యక్రమంలో దర్శకులు బోయపాటి శ్రీను, వివి వినాయక్, హరీశ్ శంకర్, కొరటాల శివ, బాబీ, బీవీఎస్ రవి, బుచ్చిబాబు సన, సాయి మాధవ్ బుర్రా, శ్రుతిహాసన్ పాల్గొన్నారు.
చిన్నప్పుడు నేను చొక్కాలు చించుకుని ఒక్క సారైనా కలవాలని కలలు కన్న నా హీరో. ఇండస్ట్రీకి వచ్చాక ఎలాగైనా ఆయన్ని డైరెక్ట్ చెయ్యాలని టార్గెట్ పెట్టుకున్న నా అభిమాన మాస్ హీరో.
నా బాలయ్యతో పని చేసే భాగ్యం కలగడం నా life time achievement కంటే lifetime responsibilityగా భావిస్తూ.జై బాలయ్య pic.twitter.com/6NG75pWQbZ— Gopichandh Malineni (@megopichand) November 13, 2021
వివి వినాయక్ తొలి క్లాప్ కొట్టారు. బోయపాటి కెమెరా రోల్ చెప్పారు. ఫస్ట్ షాట్ డైరెక్షన్ హరీశ్ శంకర్ చేశారు. కాగా, బాలయ్యకు ఇది 107వ సినిమా. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. థమన్ సంగీతం అందిస్తుండగా.. త్వరలోనే పూర్తిస్థాయిలో షూటింగ్ ప్రారంభం కానుంది.
కాగా, తాజాగా, గోపిచంద్ఈ ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. గోపించంద్ చేసిన ట్వీట్లో.. నేను చిన్నప్పుడంతా.. చొక్కాలు చించుకుని ఒక్కసారైనా కలవాలని కలలు కన్న నా హీరో ఈయన. ఆ తర్వాత ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు ఎలాగైనా ఆయనతో ఒక్క సినిమా తీయాలని ఫిక్స్ అయ్యా. బాలయ్యతో పని చేసే అదృష్టం ఇన్నాళ్లకు కలిగింది. ఆయనకు యాక్షన్ చెప్పే అవకాశం జీవితకాల బాధ్యతగా భావిస్తున్నా… జై బాలయ్య అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ గోపీచంద్ చాలా రీసెర్చ్ చేశారాట.