ఏపీలో అన్ లాక్.. జగన్ సర్కార్ నిర్ణయం?

తెలంగాణలో లాగా ఏపీలో లాక్ డౌన్ అంత కఠినంగా ఏమీలేదు. బయటకొచ్చినా కూడా పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. తెలంగాణలోలాగా స్టిక్ట్ ఏమీ లేదంటున్నారు. అవసరార్థం తిరిగే వారిని ఎవరూ ఆపడం లేదట.. యువతను మాత్రమే ఆపి ప్రశ్నిస్తున్నారట.. షాపుల వారు మాత్రం స్వచ్ఛందంగా కర్ఫ్యూ ఉన్న 12 గంటల వరకే మూసేస్తున్నారు. వీధుల్లోని అంగళ్లు మాత్రమే ఓపెన్ లో ఉంచుతున్నారు. ఇక ఇటీవలే ఈ గడువును కూడా రెండు గంటల పాటు పెంచారు. మధ్యాహ్నం […]

Written By: NARESH, Updated On : June 16, 2021 9:29 pm
Follow us on

తెలంగాణలో లాగా ఏపీలో లాక్ డౌన్ అంత కఠినంగా ఏమీలేదు. బయటకొచ్చినా కూడా పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. తెలంగాణలోలాగా స్టిక్ట్ ఏమీ లేదంటున్నారు. అవసరార్థం తిరిగే వారిని ఎవరూ ఆపడం లేదట.. యువతను మాత్రమే ఆపి ప్రశ్నిస్తున్నారట..

షాపుల వారు మాత్రం స్వచ్ఛందంగా కర్ఫ్యూ ఉన్న 12 గంటల వరకే మూసేస్తున్నారు. వీధుల్లోని అంగళ్లు మాత్రమే ఓపెన్ లో ఉంచుతున్నారు. ఇక ఇటీవలే ఈ గడువును కూడా రెండు గంటల పాటు పెంచారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఇప్పుడు అన్నీ ఓపెన్ లోనే ఉంటున్నాయి. ఇక ఇదే సమయంలో జనజీవనం దాదాపు రొటీన్ స్థితికి వచ్చింది.
కరోనా సెకండ్ వేవ్ తగ్గడంతో ఇప్పుడు జనాలు రోడ్ల మీదకు వస్తున్నారు. 45ఏళ్లు పైన వారు, యువత కూడా టీకాలు వేసుకుంటుండడంతో ఇక వ్యాపారస్థులు కూడా షాపులు తెరుస్తున్నారు. దీంతో జనజీవనం సాధారణ స్థితికి వస్తోంది.

పరిస్థితులు చక్కబడడంతో లాక్ డౌన్ సడలింపులు కూడా ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎం జగన్ ప్రకటించారు. ఈనెల 20 నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపులు ఉంటాయని జగన్ ప్రకటించారు. రాత్రి మాత్రమే కర్ఫ్యూ పెట్టి ఇక లాక్ డౌన్ నిబంధనలు ఏమీ పెట్టడని టాక్ వినిపిస్తోంది. కరోనా తగ్గుతున్న దృష్ట్యా జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిసింది.