https://oktelugu.com/

ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన హోమంత్రి అమిత్ షా..!

కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా మరోసారి ఆస్పత్రిలో చేరారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన అమిత్ షా ఇటీవలే వైరస్ నుంచి కోలుకున్నారు. తాజాగా జరిపిన పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ నిర్ధారణ అయింది. అయితే వైరస్ నుంచి కోలుకున్న కొన్ని రోజులకే ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరడం గమనార్హం. ఎయిమ్స్ ప్రత్యేక వైద్యులు బృందం అమిత్ షా ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. రాత్రి 2 గంటల సమయంలో అమిత్ షా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 18, 2020 12:43 pm
    Follow us on

    కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా మరోసారి ఆస్పత్రిలో చేరారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన అమిత్ షా ఇటీవలే వైరస్ నుంచి కోలుకున్నారు. తాజాగా జరిపిన పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ నిర్ధారణ అయింది. అయితే వైరస్ నుంచి కోలుకున్న కొన్ని రోజులకే ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరడం గమనార్హం. ఎయిమ్స్ ప్రత్యేక వైద్యులు బృందం అమిత్ షా ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది.

    రాత్రి 2 గంటల సమయంలో అమిత్ షా ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఎయిమ్స్ ప్రత్యేక వైద్యుల బృందం అమిత్ షా ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. ఢిల్లీలోని మేదాంత హాస్పిటల్‌లో అమిత్ షా కరోనా కోసం చికిత్స తీసుకోగా ఈ నెల 14వ తేదీన ఆయనకు కరోనా నెగిటివ్ నిర్ధారణ అయింది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు అమిత్ షా ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు.

    గడిచిన మూడు నాలుగు రోజుల నుంచి ఒళ్లు నొప్పులు సహా ఇతర సమస్యలతో అమిత్ షా ఇబ్బందులు పడుతున్నాడని సమాచారం. ఎయిమ్స్ ఆస్పత్రి వర్గాలు తాజాగా పోస్ట్ కోవిడ్ చికిత్స కోసం ఆయన ఆస్పత్రిలో చేరినట్లు తెలిపాయి. ఆయన ఆస్పత్రి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన తరువాత హోం ఐసోలేషన్ లో ఉండాలని నిర్ణయం తీసుకున్న అమిత్ షా మరోసారి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆస్పత్రిలో చేరారు.