కీసర ఎమ్మార్వో కేసులో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల టార్గెట్ రేవంతేనా?

కీసర ఎమ్మార్వో నాగరాజు అవినీతి కేసులో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటనే చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల ఓ వివాదంలో కీసర తహసీల్దార్ నాగరాజు రూ.1.1కోట్ల లంచం తీసుకుంటూ పట్టుబడటం తెలంగాణలో సంచలనంగా మారిన సంగతి తెల్సిందే. 19ఎకరాల 39గుంటల భూమికి సంబంధించిన భూ సమస్యను పరిష్కరించేందుకు తహసీల్దార్ రూ.1.1కోట్ల లంచం డిమాండ్ చేశారు. తహసీల్దార్ లంచం తీసుకుంటుండగా పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు నాగరాజుతోపాటు వీఆర్ఏ సాయిరాజ్ ను అరెస్టు […]

Written By: Neelambaram, Updated On : August 18, 2020 12:31 pm
Follow us on


కీసర ఎమ్మార్వో నాగరాజు అవినీతి కేసులో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటనే చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల ఓ వివాదంలో కీసర తహసీల్దార్ నాగరాజు రూ.1.1కోట్ల లంచం తీసుకుంటూ పట్టుబడటం తెలంగాణలో సంచలనంగా మారిన సంగతి తెల్సిందే. 19ఎకరాల 39గుంటల భూమికి సంబంధించిన భూ సమస్యను పరిష్కరించేందుకు తహసీల్దార్ రూ.1.1కోట్ల లంచం డిమాండ్ చేశారు. తహసీల్దార్ లంచం తీసుకుంటుండగా పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు నాగరాజుతోపాటు వీఆర్ఏ సాయిరాజ్ ను అరెస్టు చేశారు. అతడి ఇంట్లో సోదాలు నిర్వహించి భారీగా నగదు, ఇతర ఆస్తికి సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించిన సంగతి తెల్సిందే.

Also Read: కేసీఆర్ సై అంటున్నాడు..! మరి జగన్ నై అంటాడా…?

ఈ కేసులో లంచమే 1.1కోట్లు ఉండటం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఈ కేసులో ప్రభుత్వమే రేవంత్ రెడ్డిని ఇరికించే ప్రయత్నాలు చేసినట్లుగా ప్రభుత్వం పకడ్బంధీ ప్రయత్నాలు చేసిందని ప్రచారం జరుగుతోంది. నాగరాజుతో డీల్ చేసుకునేందుకు యత్నించిన సదరు వెంచర్ అధినేతతో ఎంపీ రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ కేసులో రేవంత్ రెడ్డిని ఇరికించాలనే ప్రభుత్వం యత్నించిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ వ్యవహారాన్ని ముందే గుర్తించి రేవంత్ ఈ వ్యవహారంలో పెద్దగా పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం ప్లాన్ బెడిసికొట్టినట్లు తెలుస్తోంది.

అయితే ఈకేసులో రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా వ్యవహరించిన అంజిరెడ్డి కారులో దొరికిన లెటర్ హెడ్స్ ఆధారంగా రేవంత్ ను బదానం చేసి అతడికి పీసీసీ పీఠం రాకుండా ప్రభుత్వం కాంగ్రెస్ నేతలకు సహకరిస్తుందనే టాక్ విన్పిస్తోంది. ఈమేరకు కాంగ్రెస్ సీనియర్లంతా రహస్య సమావేశం అయినట్లు తెలుస్తోంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని రేవంత్ కు పీసీసీ దక్కకుండా కాంగ్రెస్ సీనియర్లు పావులు కదుపుతున్నారని సమాచారం. అంజిరెడ్డి కారులో దొరికిన ఎంపీ లెటర్ హెడ్‌లను బహిరంగ పర్చాలంటూ వీహెచ్ వంటి నేతలు డిమాండ్ చేస్తుండటం వెనుక సీఎం కేసీఆర్ హస్తం ఉందనే గుసగుసలు విన్పిస్తున్నాయి. రేవంత్ వ్యతిరేక వర్గం ఈ వ్యవహరంలో ఒక్కటే టీపీసీసీ చీఫ్ పదవీ రాకుండా ప్లాన్ చేస్తున్నారనే టాక్ విన్పిస్తుంది.

Also Read: బీజేపీ పాలన మరీ.. ప్రశ్నిస్తే కేసులు, జైలుకే.?

టీపీసీసీ చీఫ్ పదవీపై కన్నేసిన నేతలతోపాటు రేవంత్ వ్యతిరేకవర్గం ఒక్కటవుతోంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, వీహెచ్ నేతలంతా ఇప్పటికే రహస్యంగా భేటి నిర్వహించి రేవంత్ కు పీసీసీ రాకుండా ప్లాన్ చేస్తున్నారట. ఈ వ్యవహారంలో తాత్కాలికంగా గ్రూపు కట్టడం మానాలని నిర్ణయించుకున్నారట. పీసీసీ చీఫ్ పదవీ రేవంత్ కు దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో రేవంత్ ఇటీవల ప్రభుత్వంపై దూకుడుగా వెళుతున్నారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అయితే కీసర వ్యవహారంలో రేవంత్ ను కాంగ్రెస్ నేతలే ఇరుకునపెట్టి అతడికి పీసీసీ దక్కకుండా ప్లాన్ చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఓవైపు ప్రభుత్వం.. మరోవైపు కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ టార్గెట్ చేస్తుండటంతో ఆయన ఏం చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది.