యూనియన్ కోవిడ్-19 సువిధ లోన్ ఆఫర్

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా రిజర్వ్ బాంక్ విధించిన మరిటోరియం నిబంధనలకు కట్టుబడి ఉన్నామని యూనియన్ బ్యాంక్ పేర్కొంది. 2020 మార్చి 1 నుండి మే 31 వరకు రుణాలు చెల్లించాలని స్వయం సహాయక సంఘాల సభ్యులపై ఒత్తిడి తీసుకురామని తెలిపింది. ప్రతి స్వయం ఉపాధి గ్రూపులోని సభ్యురాలు యూనియన్ కోవిడ్-19 సువిధ లోన్ కింద రూ. 5000 కరోన సహాయక లోన్ పొందవచ్చని పేర్కొంది. ఆంధ్రాబ్యాంక్ పార్వతీపురం శాఖ అధికారులు […]

Written By: Neelambaram, Updated On : April 8, 2020 4:15 pm
Follow us on


కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా రిజర్వ్ బాంక్ విధించిన మరిటోరియం నిబంధనలకు కట్టుబడి ఉన్నామని యూనియన్ బ్యాంక్ పేర్కొంది. 2020 మార్చి 1 నుండి మే 31 వరకు రుణాలు చెల్లించాలని స్వయం సహాయక సంఘాల సభ్యులపై ఒత్తిడి తీసుకురామని తెలిపింది. ప్రతి స్వయం ఉపాధి గ్రూపులోని సభ్యురాలు యూనియన్ కోవిడ్-19 సువిధ లోన్ కింద రూ. 5000 కరోన సహాయక లోన్ పొందవచ్చని పేర్కొంది. ఆంధ్రాబ్యాంక్ పార్వతీపురం శాఖ అధికారులు స్వయం ఉపాధి సంఘాల మహిళలను లోన్స్ బకాయిలు చెల్లించమని ఒత్తిడి చేస్తున్న విషయాన్ని ఎం.సింహాచలం అనే వ్యక్తి ట్విట్టర్ ద్వారా ఎంపీ కేశినేని నాని గారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై కేశినేని నాని కేంద్ర ప్రభుత్వం లోన్స్ చెల్లింపుకు గడువు పొడిగించామని మోరటోరియం జారీచేసిన విషయాన్ని ప్రస్తుతం ఆంధ్రా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ లో వీలీనమైన కారణంగా, యూనియన్ బ్యాంక్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరాగా యూనియన్ బ్యాంక్ అధికారులు ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించారు.