Union Budget 2026: మరికొద్ది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది.. ఇప్పటికే బడ్జెట్ కు సంబంధించిన కేటాయింపులు.. ఇతర వ్యవహారాలు పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియాలో బడ్జెట్ కు సంబంధించి ఒక కథనం ప్రసారమవుతోంది.
ఈసారి బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానాన్ని తెరపైకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. మనదేశంలో పన్ను వ్యవస్థను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో 2020 నుంచి అనేక రకాల మార్పులు తీసుకొస్తున్నారు. 2026 బడ్జెట్లో మాత్రం వివాహితుల కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా “ఆప్షనల్ జాయింట్ టాక్సేషన్”(optional joint taxation) ను తెరపైకి తీసుకురానుంది. ఇప్పటివరకు భార్యాభర్తలు ఒకవేళ ఇద్దరు ఉద్యోగస్తులై.. లేదా భారీగా సంపాదించే వాళ్ళు అయితే.. వారు విడివిడిగా ప్రభుత్వానికి ట్యాక్స్ లు చెల్లిస్తున్నారు. 2026 బడ్జెట్లో మాత్రం కేంద్రం కొత్త ప్రతిపాదన తీసుకొస్తోంది. ఆలూ మగలను ఆర్థిక యూనిట్ గా పరిగణిస్తోంది. భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తే.. దానిని వారిద్దరూ తమ ఉమ్మడి ఆదాయంగా ప్రకటించవచ్చు. దానిపై పన్ను ను చెల్లించవచ్చు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలలో ఈ విధానం అమల్లో ఉంది. మన దేశంలో కూడా ఇలాంటి విధానాన్ని అమలు చేస్తే పన్ను చెల్లించే వారు తమ ఆర్థిక ప్రణాళికను మరిత సమర్థవంతంగా రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఈ విధాన గనక అమలులోకి వస్తే భార్యాభర్తల ఉమ్మడి పన్ను మినహాయింపు పరిమితి పెరుగుతూ ఉంటుంది. విడివిడిగా ఉన్నప్పుడు లభించే మినహాయింపుల కంటే.. సంయుక్తంగా ఫైల్ చేసినప్పుడు ఒకేసారి భారీగా మినహాయింపు లభిస్తుంది. దీనివల్ల దంపతుల మీద పన్ను భారం తగ్గుతుంది. అంతేకాదు ఓకే ఐ టి ఆర్ దాఖలు చేయడానికి అవకాశం ఉంటుంది..
జాయింట్ ట్యాక్స్ విధానం వల్ల వేతన జీవులకు ప్రామాణిక మినహాయింపులు, ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. ఈ విధానం మధ్యతరగతి కుటుంబాలకు ఒక వరంలాగా మారుతుంది. భార్య లేదా భర్త మాత్రమే సంపాదించే కుటుంబాలకు మెరుగైన ప్రయోజనం కలిగిస్తుంది. జాయింట్ ఫైలింగ్ వల్ల పన్ను స్లాబ్ రేటు తగ్గుతూ ఉంటుంది. నీతో పాటు పొదుపు పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు కుటుంబాల చేతిలో ఖర్చు చేసుకోవడానికి నగదు భారీగా ఉంటుంది. తద్వారా వినియోగ వ్యవస్థ పెరిగిపోయి.. దేశ ఆర్థిక రంగానికి శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.