Anant Ambani Watch Price: మనలో చాలామందికి డబ్బులు ఖర్చు పెట్టాలని ఉంటుంది కానీ.. ఆ స్థాయిలో సంపాదనలేక సైలెంట్ గా ఉండిపోతాం. కానీ కొంతమంది డబ్బులు మంచినీళ్ల ప్రాయం మాదిరిగా ఖర్చు పెడుతుంటారు. విలాసవంతమైన వస్తువుల కోసం వందలు, వేల కోట్లు ఖర్చు పెడుతుంటారు. ఈ జాబితాలో ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ముందు వరుసలో ఉంటాడు.. జంతువులపై ఇతడికి విపరీతమైన ప్రేమ ఉంటుంది.. అదే సమయంలో విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఇతడి మనసు తహతలాడుతూ ఉంటుంది. అందువల్లే అతడు లగ్జరీ బ్రాండ్స్ కోసం విపరీతంగా ఖర్చు పెడుతుంటాడు.
తన పెళ్లికి వందల కోట్లను ఖర్చుచేసిన అనంత్.. చేతికి ధరించే గడియారం కోసం ఏకంగా వందల కోట్లు మంచినీళ్ళప్రాయం లాగా ఖర్చు పెట్టాడు. ఇప్పుడు అతడు ధరించిన గడియారానికి సంబంధించి సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ నడుస్తోంది.. ఇంతకీ అతడు ధరించిన వాచి ఏ కంపెనీ తయారు చేసింది? దాని ధర ఎంత అంటే..
అమెరికాలోని న్యూయార్క్ లో జాకబ్ అండ్ కో కంపెనీ లగ్జరీ వాచీలను తయారు చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అనంత్ అంబానీ కోసం కష్టమైస్ వాచి తయారు చేసింది. దానికి వంతరా అని పేరు పెట్టింది. ఇటీవల దీనిని ఆవిష్కరించింది. దీనిని హోరోలాజికల్ మాస్టర్ పీస్ గా అభివర్ణిస్తున్న జాకబ్ ఎండ్ కో.. “ఒపేరా వంతారా గ్రీన్ కామో” గా చెబుతోంది. అనంత్ అంబానికి వంతార అంటే చాలా ఇష్టం. ఈ వాచీ ని జాకబ్ అండ్ కో కంపెనీ అద్భుతంగా రూపొందించింది. ఈ వాచీలో డైమంటాయిడ్ గోమేదికాలు, సావో రైట్ లు, ఆకుపచ్చ రంగులో ఉన్న నీలమని, తెలుపు రంగులో ఉన్న వజ్రాలను ఇందులో వాడింది. 21.98 క్యారెట్ల తో దాదాపు 400 విలువైన స్టోన్స్ వాడింది. ఈ వాచీ విలువ దాదాపు 12.5 కోట్లని జాకబ్ అండ్ కో కంపెనీ తెలిపింది. ఇది అనంత్ అంబానీ కోసం ప్రత్యేకంగా రూపొందించామని వెల్లడించింది. ఈ వాచి తయారు చేయడానికి ఎంత సమయం పట్టిందో మాత్రం జాకబ్ అండ్ కో కంపెనీ బయటికి వెల్లడించలేదు. కాకపోతే ఈ వాచ్ ను జాకబ్ అండ్ కో కంపెనీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో కాస్త ఇప్పుడు సంచలనంగా మారింది