Chiranjeevi (1)
Chiranjeevi: ఒక్క నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది. అలాగే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ కావచ్చు. చిత్ర పరిశ్రమలో స్క్రిప్ట్ సెలక్షన్ కీలక పాత్ర వహిస్తుంది. మంచి కథలు, కథనాలు, దర్శకులను ఎంచుకున్న నటులు స్టార్స్ అవుతారు. లేదంటే పరాజయాలతో రేసులో వెనకబడిపోతారు. ఇప్పుడు స్టార్స్ గా వెలుగొందుతున్న హీరోలందరూ గొప్ప కథలతో సినిమాలు చేసి విజయాలు సాధించినవారే. కాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ మూవీ విషయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
దర్శకుడు, నిర్మాత వద్దని పక్కన పెట్టిన కథతో ఆయన సినిమా చేశారు. నిర్మాత అశ్వినీదత్-చిరంజీవి మధ్య గట్టి అనుబంధం ఉంది. వీరి కాంబోలో అనేక చిత్రాలు వచ్చాయి. అశ్వినీదత్ నిర్మించిన జగదేకవీరుడు అతిలోకసుందరి కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. బి గోపాల్ దర్శకుడిగా చిరంజీవితో ఒక సినిమా చేయాలని సీ. అశ్వినీదత్ ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకు ఆయన కథల కోసం అన్వేషిస్తున్నారు. అప్పట్లో స్టార్ రైటర్ గా ఉన్న చిన్ని కృష్ణకు ఆ బాధ్యత అప్పగించారు.
ఆరు నెలలు కష్టపడి చిన్ని కృష్ణ ఓ కథ రాసి.. బి. గోపాల్, అశ్వనీదత్ లకు వినిపించాడట. కథ వాళ్లకు నచ్చలేదు. వేరే కథను ఎంచుకోవడం మంచిది అని భావించారట. నిరాశ చెందిన చిన్ని కృష్ణ… ఈ విషయం పరుచూరి గోపాలకృష్ణకు చెప్పాడట. నువ్వు చిరంజీవికి చివరి ప్రయత్నంగా ఈ కథ వినిపించు అన్నాడట. దర్శకుడికి, నిర్మాతకు నచ్చని తరుణంలో.. చిరంజీవి కూడా ఈ కథను రిజెక్ట్ చేస్తారని చిన్న కృష్ణ భావించారట.
ఆశలు ఏమి పెట్టుకోకుండానే.. చిరంజీవి నివాసానికి వెళ్లి కథ చెప్పాడట. చిరంజీవి ఆ కథ చాలా బాగా నచ్చిందట. మనం సినిమా చేస్తున్నాము అని హామీ ఇచ్చాడట. ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ కి కాసుల వర్షం కురిపిస్తుంది. నన్ను నమ్మండి అని.. బి. గోపాల్, సీ. అశ్వినీ దత్ లను ఒప్పించి చిరంజీవి మూవీ చేశారు. ఆ చిత్రమే ఇంద్ర. 2002లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో విడుదలైన ఇంద్ర ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది. పరాజయాలతో ఇబ్బందిపడుతున్న చిరంజీవికి భారీ బ్రేక్ ఇచ్చింది.
సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించిన ఇంద్ర చిత్రానికి మణిశర్మ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. అలా చిరంజీవి తన జడ్జిమెంట్ తో అపూర్వ విజయం అందుకున్నారు.
Web Title: Interesting facts about the movie indra
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com