https://oktelugu.com/

Union Budget 2024: బడ్జెట్‌ ఎఫెక్ట్‌.. నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్న స్టాక్‌ మార్కెట్‌..

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రభావం దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పడింది. ఈసారి కేంద్రం బడ్జెట్‌లో సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. వ్యవసాయం, విద్య, వైద్యం యువతకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. దీని ప్రభావం స్టాక్‌ మార్కెట్లపై పడింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 23, 2024 / 01:21 PM IST

    Union Budget 2024

    Follow us on

    Union Budget 2024: బడ్జెట్‌ –2024–25 : కేంద్రం పార్లమెంట్‌లో రాబోయే 8 నెలల కాలానికి పూర్తి బడ్జెట్‌ను మంగళవారం(జూలై 23న) ప్రవేశపెట్టింది. గత ఫిబ్రవరిలో ఎన్నికల నేపథ్యంలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ బడ్జెట్‌లో ఎలాంటి ఊరట ఇవ్వలేదు. కానీ, మోదీ 3.0 సర్కార్‌ ఏర్పాటు తర్వాత ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు కొనసాగింపుగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్రం సంక్షేమానికి ఈసారి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. వ్యవసాయం, విద్య, ఉపాధి, గృహనిర్మాణరంగాలకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఎంఎస్‌ఎంఈలకు కూడా రుణ పరిమితిని పెంచింది. ముద్ర రుణ పరిమితిని పెంచింది. స్టాండర్డ ట్యాక్స్‌ విధానం అమలు చేస్తామని తెలిపింది. దీంతో కొత్తగా టాక్స్‌ పరిధిలోకి వచ్చేవారికి లాభం చేకూరుతుందని తెలిపింది. ఇలా కేంద్రం ఎక్కువగా సంక్షేమానికి తాజా బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వడంతో స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెస్‌ 900 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 300 పాయింట్లకుపగా నష్టపోయింది. దీంతో పలు సంస్థల షేర్లు పతనమయ్యాయి. మదుపరులు ఎక్కువగా అమ్మకాలకే మొగ్గు చూపారు.

    ఒడిదుడుకులు సహజం..
    కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న వేళ.. స్టాక మార్కెట్లలో ఒడిదుడుకులు సహజంగానే ఉంటాయి. కేంద్రం పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడు మార్కెట్లలో ఉత్సాహం కనిపిస్తుంది. సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తే.. షేర్లు పతనం కావడం జరుగుతుంది. తాజా బడ్జెట్‌లో గ్లోబల్‌ మార్కెట్‌ నుంచి వచ్చిన సంకేతాలతో దేశీయ మార్కెట్‌ నష్టాలు కొనసాగుతున్నాయి. సోమవారం కూడా మార్కెట్‌ నష్టాలతోనే ప్రారంభమైంది. టాక్స్‌ పరిమితి పెంపు, స్టాండర్డ్‌ టాక్స్‌ డిడక్షన్‌ రూ.75 వేలకు పెంచడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.