Union Budget 2024: కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను మంగళవారం(జూలై 23న) ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పేద, మధ్యతరగతి, కార్మికులు, ఉద్యోగుల అనేక ఆశల నడుమ ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.. 8 నెలల కాలానికి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ మొత్తం విలువ రూ. 32.07 లక్షల కోట్లు.
పన్ను విధానంలో కీలక మార్పు..
కేంద్ర బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరట లభించింది. కొత్త పన్ను విధానంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని మార్పులు చేశారు. పన్ను శ్లాబుల్లో మార్పుతోపాటు, స్టాండర్డ్ డిడక్షన్ విషయంలో ఊరట కల్పించారు. ప్రస్తుతం స్టాండడర్డ్ డిడక్షన్ రూ.50 వేలు ఉండగా దానిని రూ.75 వేలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. దీనివల్ల రూ.17,500 వరకు పన్ను చెల్లింపుదారులు పన్ను ఆదా చేసుకోవచ్చని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇదే సమయంలో పాత పన్ను విదానంలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించారు.
బడ్జెట్‌లో పన్ను ప్రతిపాదనలు ఇలా..
ఎప్పటిలాగనే కంద్రం పన్ను విధానంలో రూ.3 లక్షల వరకు ఎలాంటి పన్ను విధించలేదు. గతలో రూ.3–6 లక్షల శ్లాబులో 5 శాతం పనున విధించేవారు. ఆ పరిమితిని రూ.7 లక్షల వరకు పెంచారు. గతంలో రూ.6–9 లక్షల వరకు ఉన్న శ్లాబును ఇప్పడు రూ.7–10 లక్షల శ్లాబ్‌గా మార్చారు. దీనిపై పన్ను 10 శాతంగా నిర్ణయించారు. ఇక రూ.10–12 లక్షల శ్లాబులో పన్ను శాతం 15 శాతం, రూ.12–15 శ్లాబ్‌లో పన్ను శాతం 20గా నిర్ణయించారు. ఇక రూ.15 లక్షలకుపైగా ఆదాయం ఉన్నవారికి 30 శాతం పన్ను విధిస్తామని తెలిపారు.