https://oktelugu.com/

Union Budget 2024: కేంద్ర బడ్జెట్‌ 2024–25 : నిర్మలమ్మ పద్దు.. కీలక ప్రకటనలు..

కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను మంగళవారం(జూలై 23న) ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వరుసగా ఆరోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పేద, మధ్యతరగతి, కార్మికులు, ఉద్యోగుల అనేక ఆశల నడుమ ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.. 8 నెలల కాలానికి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ మొత్తం విలువ రూ. 32.07 లక్షల కోట్లు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 23, 2024 / 02:35 PM IST

    Union Budget 2024

    Follow us on

    Union Budget 2024: మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలు, వికసిత్‌ భారత లక్ష్యంగా కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిపారు. వ్యవసాయరంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇందన భద్రత, మౌలికరంగం, పరిశోధన–ఆవిష్కరణలు, తయారీ, సేవలు, తర్వాత తరం సంస్కరణలు అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు.

    బడ్జెట్‌లో కీలక ప్రకటనలు ఇవే..
    – స్టాండర్డ్‌ టాక్స్‌ డిడక్షన్‌ రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంపు. కొత్త పన్ను విధానం శ్లాబుల్లో మార్పులు, రూ.3 లక్షల వరకు పన్ను నుంచి మినహాయింపు.

    – మొబైల్‌ ఫోన్లు, మొబైల్‌ పీసీడీఏ, మొబైల్‌ చార్జర్లపై విధించే బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ 15 శాతానికి తగ్గింపు.

    – బంగారం, వెండి,పై కస్టమ్స్‌ ట్యాక్‌ 6 శాతం వరకు తగ్గింపు. ప్లాటినంపై 6.4 శాతం కుదింపు

    – ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాలో 3 కోట్ల అదనపు ఇళ్ల నిర్మాణం, అర్బన్‌ హౌసింగ్‌ కోసం ఐదేళ్లలో రూ.2.2 లక్షల కోట్లు కేటాయింపు.

    – పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం, పీపీపీ విధానంలో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం.

    – ముద్ర రునాల పరిమితి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు. బడ్జెట్‌లో గ్రామీణ అభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయింపు

    – ప్రకృతి వ్యవసాయానికి దేశవ్యాప్తంగా కోటిమంది రైతులను తీసుకువచ్చే ప్రణాళిక, 5 రాస్ట్రాల్లో కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు, వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి రూ.1.5 లక్షల కోట్లు.

    – వచ్చే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు నైపుణ్యాల శిక్షణ, 500 పెద్ద కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌లు.

    – దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు రూ.10లక్షల వరకు విద్యా రుణలు.

    – మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11.11లక్షల కోట్ల కేటాయింపు. జీడీపీలో ఇది 3.4 శాతానికి సమానం.

    – మహిళలు, బాలికల కోసం రూ.3 లక్షల కోట్లతో పథకాలు, విద్య, ఉపాధి, నైపుణ్యాల అభివృద్ధికి రూ.1.48 లక్షల కోట్లు.

    – ఎంపిక చేసిన నగరాల్లో స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్‌ల ఏర్పాటు, రాష్ట్రాల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రూ.1.5 లక్షల కోట్లతో దీర్ఘకాల వడ్డీ రహిత రుణాలు.

    – కొత్త ఉద్యోగులకు మూడో ప్రోత్సాహకారలు. సంఘటిత నంగంలోకి ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో గరిష్టంగా రూ.15 వేలు చెల్లింపు, నెలకు గరిష్టంగా రూ.ల‘ల లోపు వేతనం ఉన్నవారు అర్హులు. దీనివల్ల 210 లక్షల మందియువతకు లబ్ధి.

    – పీఎం స్వనిధి కింద వంద నగరాల్లో ప్రత్యేక వార సంతల ఏర్పాటు

    – క్యాపిట్‌ గెయిన్స్‌ విధానం సరళీకరణ. దీర్ఘకాలిక లాభాలపై 12.5 శాతం పన్న. స్టార్టప్‌లకు ప్రోత్సాహం. ఏంజెల్‌ ట్యాక్స్‌ రద్దు.