https://oktelugu.com/

పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణ

పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరేమిటో స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వ రంగ సంస్థల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించాలని ఈరోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ 2021–-22లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. కొత్త ప్రాజెక్టులను నిర్మించాలంటే ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ప్రాజెక్టుల నుంచి పెట్టుబడులను ఉపసంహరించడం ఒక్కటే మార్గమని ఆమె పేర్కొన్నారు. గతేడాది పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లక్షా 75 వేల కోట్లను సేకరించినట్లు చెప్పారు. Also […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 1, 2021 / 03:50 PM IST
    Follow us on


    పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరేమిటో స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వ రంగ సంస్థల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించాలని ఈరోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ 2021–-22లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. కొత్త ప్రాజెక్టులను నిర్మించాలంటే ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ప్రాజెక్టుల నుంచి పెట్టుబడులను ఉపసంహరించడం ఒక్కటే మార్గమని ఆమె పేర్కొన్నారు. గతేడాది పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లక్షా 75 వేల కోట్లను సేకరించినట్లు చెప్పారు.

    Also Read: బడ్జెట్ 2021-22 రౌండప్: ముఖ్యాంశాలు.. పెరిగేవి.. తగ్గేవి ఇవీ

    ఈ ఏడాది కూడా కొత్తగా గెయిల్‌, హెచ్‌పీసీల్‌, ఐఎంసీల నుంచి ప్రభుత్వ వాటాను ఉపసంహరించుకోనున్నట్లు తెలిపారు. గతేడాది ప్రారంభించిన ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌తోపాటు మరికొన్ని సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణను కొనసాగిస్తామని చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా కుండబద్దలు కొట్టింది. టార్గెట్ పెట్టి మరీ పెట్టుబడులను ఉపసంహరించుకోబోతున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆరంభం కాబోయే 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల్లో ఈ అంశాన్ని చేర్చింది.

    Also Read: అధ్యక్షుడు కాకున్నా.. డైరెక్షన్‌ మొత్తం ఆయనదే..!

    కొత్త ఆర్థిక సంవత్సరంలో లక్షా 75 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు కేంద్రం ప్రభుత్వం తేల్చి చెప్పింది. 2020-–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఈ మొత్తం తక్కువే. ఈ ఏడాది అమ్మకానికి ఉంచిన ప్రభుత్వ రంగ సంస్థల జాబితాను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిండుసభలో ప్రకటించారు. ఈ జాబితాలో రెండు ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులను కూడా చేర్చారు. ప్రభుత్వరంగానికి చెందిన ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ)ని ఈ జాబితాలో చేర్చారు. ప్రభుత్వ రంగానికే చెందిన మరో బ్యాంకు, ఓ జీవిత బీమా కంపెనీలో కూడా పెట్టుబడులను ఉపసంహరించుకోబోతోన్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్), ఎయిరిండియా షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాల్లో పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుందని తెలిపారు. వాటిని ప్రైవేటీకరించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.ఇప్పటికే ఆమోదించిన జాబితాలో యథాతథంగా ఉంటుందని అన్నారు. కాగా..- ప్రభుత్వ రంగానికి చెందిన జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఐపీఓ వచ్చే ఏడాది వరకు కొనసాగుతుందని చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల శాతాన్ని 74కు పెంచినట్లు వెల్లడించారు. ఇదివరకు ఈ మొత్తం 49 శాతానికి మాత్రమే పరిమితమై ఉండేది. సెంటర్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ ప్రైజెస్ (సీపీఎస్ఈ) పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 2020–-21 ఆర్థిక సంవత్సరంలో 19,499 కోట్ల రూపాయలను ఆర్జించినట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.