Homeజాతీయ వార్తలుRahul Gandhi: ఫాఫం.. రాహుల్ గాంధీకి ఎంత పరిస్థితి వచ్చే..వీడియో వైరల్!

Rahul Gandhi: ఫాఫం.. రాహుల్ గాంధీకి ఎంత పరిస్థితి వచ్చే..వీడియో వైరల్!

Rahul Gandhi
Rahul Gandhi

Rahul Gandhi: ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది’ అంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుండగా.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి బీజేపీకి అస్త్రంగా మారాయి. గురువారం రాహుల్‌ విలేకరులతో మాట్లాడుతూ పదాలు తప్పుగా వాడారు. ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్‌ ప్రస్తుతం నెట్టింట్లోల వైరల్‌ అవుతోంది. దీనిపై కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు రాహుల్‌పై విరుచుకుపడుతున్నారు.

దురదృష్టవశాత్తు ఎంపీ అయ్యా..
శుక్రవారం పార్లమెంట్‌ వాయిదా పడిన అనంతరం రాహుల్‌ పాల్గొన్న మీడియా సమావేశానికి చెందిన ఒక వీడియో క్లిప్‌ వైరల్‌గా మారింది. అందులో రాహుల్‌ మాట్లాడుతూ..‘దురదృష్ట్టవశాత్తు.. నేను పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్నాను’ అని అనడం కనిపిస్తోంది. వెంటనే ఆ మాటల వెనక ఉన్న తప్పిదాన్ని గుర్తించిన జైరాం రమేశ్‌.. రాహుల్‌ వైపు వంగి వాటిని సరిచేశారు. ‘దురదృష్టవశాత్తు, నేను పార్లమెంట్‌ సభ్యుడినయ్యానని వారు జోక్‌ చేయగలరు’ అని మార్దిచెప్పమన్నారు. అప్పుడు రాహుల్‌..‘ఇక్కడ నేను మీకు ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. మీ దురదృష్టం కొద్దీ నేను పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్నాను’ అంటూ బీజేపీ నేతలను ఉద్దేశించి అన్నారు. కానీ, అప్పటికే ఈ క్లిప్‌ను బీజేపీ వైరల్‌ చేసింది.

Rahul Gandhi
Rahul Gandhi

పీయూశ్‌ గోయల్‌ సెటైర్లు..
‘దురదృష్టవశాత్తు.. దీనిపై మాట్లాడటానికి మా దగ్గర పదాలు లేవు’ అని కేంద్ర మంత్రి పీయూశ్‌గోయల్‌ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించారు. ఇది నిజంగా దురదృష్టమంటూ మరో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఈ వీడియోను పోస్టు చేశారు. కాగా, ఈ విమర్శలపై జైరాం రమేశ్‌ స్పందిస్తూ.. ‘మళ్లీ బీజేపీ తన ఫేక్‌ న్యూస్‌ మెషిన్‌కు పనిచెప్పింది. రాహుల్‌ తన మాటలపై అప్పుడే స్పష్టత ఇచ్చారు. మేం ఎటవంటి టెలిప్రాంప్టర్లు లేకుండా మీడియాతో మాట్లాడతాం. అదానీ స్కాంను పక్కదోవపట్టించేందుకు ఇది మరో ప్రయత్నం’ అంటూ మండిపడ్డారు.

ఏది ఏమైనా రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు, తప్పుడు పద ప్రయోగం ఇప్పటికే నెట్టింట్లో చెక్కర్లు కడుతూ ఎంత డ్యామేజ్‌ చేయాలో అంత చేస్తూనే ఉంది. ఇది బీజేపీకి అస్త్రంగా మారింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version