
Homeo$exual : ఇద్దరు యువతుల మధ్య స్నేహం కుదిరి సహజీవనం వరకు వెళ్లింది. దీంతో ఇద్దరి మధ్య చనువు ఎక్కువైంది. ఒకే గదిలో ఉంటూ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమతో ఒకటిగా జీవనం సాగిస్తున్నారు. దీంతో స్నేహితురాలు మరొకరితో చనువుగా ఉంటుందనే అక్కసుతో మిత్రురాలును హతం చేసింది. సినిమా కథనంలా మారిన ఈ ఘటన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తనతో కలిసి ఉన్న స్నేహితురాలు వేరొకరితో ప్రేమతో ఉంటుందనే కారణంగా ఆమెను హత్య చేసింది.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం మామిడిగట్టుకు చెందిన సల్లూరి అంజలి (21) నెన్నెల మండలం మన్నెగూడెంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్తుండేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పెరుగు మహేశ్వరి అలియాస్ మహేశ్ తో పరిచయం ఏర్పడింది. రెండేళ్ల కిందట మంచిర్యాలలో ఓ గది అద్దెకు తీసుకుని మహేశ్వరి, ఆమె చెల్లెలు పరమేశ్వరి, సోదరుడు విఘ్నేష్ తో పాటు అంజలి కలి సి ఉంటున్నారు. మహేశ్వరి ఓ కళ్లద్దాల దుకాణంలో పనిచేస్తోంది.
ఈ నేపథ్యంలో మహేశ్వరికి అంజలికి మధ్య మంచి సన్నిహిత్యం ఏర్పడింది. ఇద్దరు సహజీవనం చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏర్పడింది. అంజలికి ఇటీవల ఓ కన్సెల్టెన్సీ నిర్వహించే శ్రీనివాస్ తో పరిచయం ఏర్పడి వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దీంతో మహేశ్వరిని దూరం పెడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్వరిలో ప్రతీకార జ్వాల రగిలింది. అంజలిని ఎలాగైనా అంతం చేయాలని పథకం రచించింది. ఇందులో భాగంగానే బుధవారం రాత్రి గదికి వెళ్లి అంజలిని తీసుకుని మామిడిగట్టుకు వెళ్దామంటూ తీసుకెళ్లింది. రాత్రి 11.30 ప్రాంతంలో శ్రీనివాస్ కు ఫోన్ చేసి అంజలి ఆత్మహత్య చేసుకుందని తాను కూడా చేసుకుంటున్నానని చెప్పింది.

దీంతో శ్రీనివాస్ పరమేశ్వరితో కలిసి కారులో గుడిపల్లి గ్రామ శివారులోకి చేరుకున్నారు. అక్కడ అపస్మారక స్థితిలో ఉన్న అంజలి, మహేశ్వరిని ఆస్పత్రికి తరలించారు. అంజలి అప్పటికే మరణించగా మహేశ్వరికి చికిత్స అందిస్తున్నారు. అంజలి మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలని కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మహేశ్వరి, శ్రీనివాస్ లను అదుపులోకి తీసుకున్నారు. కేసును విచారిస్తున్నారు. మహేశ్వరి అంజలిని హత్య చేసిందని తెలుస్తోంది.