Homeఆంధ్రప్రదేశ్‌కిడ్నాప్ కథలో అనూహ్య మలుపు.. అఖిలప్రియనే సూత్రధారి?

కిడ్నాప్ కథలో అనూహ్య మలుపు.. అఖిలప్రియనే సూత్రధారి?

A1 Akhila Priya

అత్యాశకు పోయి అఖిలప్రియ కటకటాల పాలైందా? అందరూ అనుకుంటున్నట్టు ఆ భూమి 50 ఎకరాలు కాదు.. కేవలం 25 ఎకరాలు. తన తండ్రి కొన్న భూమి వివాదాల్లో చిక్కుకోవడం.. ఆ భూమి కోసం అఖిల ప్రియ ఏకంగా కిడ్నాప్ నకు స్కెచ్ గీయడం..మొత్తంగా ఇప్పుడు జైలు పాలు కావడం విషాదం నింపింది. ఆస్తుల కోసం ఆశపడిన అఖిలప్రియకు ఇప్పుడు కటకటాలే దిక్కవుతున్నాయి. కిడ్నాప్ కేసులో నిన్న విలేకరుల సమావేశంలో ఏ1 గా ఏవీ సుబ్బారెడ్డి పేరును ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినట్టు సీపీ అంజనీకుమార్ తెలిపారు. తాజాగా ఏవీ సుబ్బారెడ్డిని ఏ2గా, భూమా అఖిల ప్రియను ఏ1గా చేర్చారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా అఖిలప్రియ మారిపోవడం సంచలనమైంది. ఇక మిగతా నిందితులుగా శ్రీనివాసరావు, సాయి, చంటి, ప్రకాష్ లను చేర్చారు. హఫీజ్ పేట లో సర్వే నెంబర్ 80 లో 2016లో ప్రవీణ్ రావు తదితరులు 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, ఆ 25 ఎకరాల భూమి తమదేనని భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి, భార్గవ్ రామ్ లు వేధిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. హాఫిజ్ పెట్ లోని భూమి ధర పెరగడంతో నిందితులు సమస్యలు సృష్టించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Also Read: టీపీసీసీ చీఫ్‌ పేరు ప్రకటన అందుకే ఆగిందట..? : కారణం ఏంటో తెలుసా

ఇక ఈ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అఖిలప్రియ గర్భవతి అంటూ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులతో ఆమె గర్భవతి అంటూ ప్రచారం చేసినట్టు సమాచారం. పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో తాను ప్రెగ్నెంట్ అని అందుకే కళ్ళు తిరుగుతున్నాయి అని పోలీసులకు వెల్లడించింది. దీంతో పోలీసులు వెంటనే ఆమెను కేర్ హాస్పిటల్ కి తరలించారు. కేర్ హాస్పటల్లో వైద్యులు అఖిలప్రియకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అసలు ఆమె గర్భవతి కాదని పోలీసులకు తేల్చి చెప్పారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై పూర్తి క్లారిటీ పోలీసుల నుంచి రావాల్సి ఉంది.

కేసులో మొదటగా అందరూ అనుమానించింది అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ నే. ఈయన పారిపోయాడని వార్తలు వచ్చాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ప్రభుత్వం బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు బెంగళూరుకు బయల్దేరాయి. అటు తాము పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలని ఈకిడ్నాప్ కేసులో ఏ1గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Also Read: అధికార పార్టీ టార్గెట్‌ బీజేపీ కాదంట.. ఆయనపైనే విమర్శలు

ఈ మొత్తం వివాదానికి కారణం 25 ఎకరాల భూమి అని తేలింది. అది చనిపోయిన భూమా అఖిలప్రియ తండ్రి నాగిరెడ్డి కొన్న భూమి విషయంలోనే విభేదాలు తలెత్తాయి. హఫీజ్ పేటలో ఏవీ సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డిలు భూములు కొనుగోలు చేశారట.. భూమా నాగిరెడ్డికి ప్రవీణ్ రావు తండ్రి కిషన్ రావు సన్నిహితుడని విచారణలో తేలింది. భూమా నాగిరెడ్డి బతికి ఉన్నప్పుడు కిషన్ రావు కీలకంగా వ్యవహరించాడు. అయితే భూమా నాగిరెడ్డి మరణం తర్వాతే ఈ గొడవలు మొదలయ్యాయి. ఏవీ సుబ్బారెడ్డి ఈ భూవివాదంలోకి వచ్చాడు. ఏవీ ఎస్టేట్స్ పేరిట ల్యాండ్ లోకి ప్రవేశించడంతో వివాదం తలెత్తింది. గత ఏడాది ఏవీ సుబ్బారెడ్డిపై కేపీ ఎస్టేట్స్ ఓనర్ ప్రవీణ్ రావు కేసు పెట్టారు. 50 ఎకరాల్లో చెరో 25 ఎకరాల భూమి చెందేటట్లు మధ్యవర్తిత్వం చేశారు. ఏవీ సుబ్బారెడ్డితో గతంలోనే ప్రవీణ్ రావు సెటిల్ మెంట్ చేసుకున్నారు. 25 ఎకరాల భూమి తమకే కావాలని ప్రవీణ్ రావుపై భూమా ఫ్యామిలీ ఒత్తిడి చేశారు. పక్కా ప్లాన్ తో నే భూమా ఫ్యామిలీ కిడ్నాప్ నకు పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విచారణ అనంతరం తేలనుంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version