https://oktelugu.com/

టీపీసీసీ చీఫ్‌ పేరు ప్రకటన అందుకే ఆగిందట..? : కారణం ఏంటో తెలుసా

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో టీపీసీసీ చీఫ్‌ ఎవరో ఇంకా తేలడం లేదు. ఆ సస్పెన్స్‌ ఇంకా నడుస్తూనే ఉంది. ఇక రేపో మాపో ప్రకటిస్తారని ఇన్ని రోజులు లీకులు ఇచ్చినా.. ఇంకా ఎక్కడా ఆ ప్రకటన అయితే రాలేదు. రేవంత్‌రెడ్డి ఫైనల్‌ అని ఒకానొక సందర్భంలో అధిష్టానం ఫిక్స్‌ అయినా ఎందుకో చివరి నిమిషంలో మనసు మార్చుకుంది. అంతేకాదు.. ఈ పదవి కోసం రోజుకో కొత్త పేరు వెలుగులోకి వస్తోంది. తాజాగా.. జీవన్‌రెడ్డికి పీసీసీ ఇస్తున్నారని ప్రచారం […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 7, 2021 / 03:02 PM IST
    Follow us on


    తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో టీపీసీసీ చీఫ్‌ ఎవరో ఇంకా తేలడం లేదు. ఆ సస్పెన్స్‌ ఇంకా నడుస్తూనే ఉంది. ఇక రేపో మాపో ప్రకటిస్తారని ఇన్ని రోజులు లీకులు ఇచ్చినా.. ఇంకా ఎక్కడా ఆ ప్రకటన అయితే రాలేదు. రేవంత్‌రెడ్డి ఫైనల్‌ అని ఒకానొక సందర్భంలో అధిష్టానం ఫిక్స్‌ అయినా ఎందుకో చివరి నిమిషంలో మనసు మార్చుకుంది. అంతేకాదు.. ఈ పదవి కోసం రోజుకో కొత్త పేరు వెలుగులోకి వస్తోంది. తాజాగా.. జీవన్‌రెడ్డికి పీసీసీ ఇస్తున్నారని ప్రచారం నడుస్తోంది.

    Also Read: అధికార పార్టీ టార్గెట్‌ బీజేపీ కాదంట.. ఆయనపైనే విమర్శలు

    అయితే.. కాంగ్రెస్‌ అధిష్టానం పీసీసీ చీఫ్‌ పేరు ప్రకటించకుండా అడ్డుపడ్డది ఆ పార్టీ సీనియర్‌‌ లీడర్‌‌, మాజీ మంత్రి జానారెడ్డి అంట. ఇటీవల నాగార్జునసాగర్‌‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మాత్తుగా చనిపోయారు. దీంతో ఇప్పుడు ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. ఏ క్షణాన్నైనా నోటిఫికేషన్‌ రావచ్చు. ఈ ఉప ఎన్నిక అయిపోయేంత వరకు టీపీసీసీ అధ్యక్షుడి పేరు ప్రకటించొద్దని జానారెడ్డి హైకమాండ్‌ను కోరాడు. ఇప్పుడే ప్రకటిస్తే మరోసారి పార్టీలో విభేదాలు వచ్చే అవకాశం వస్తుందని.. గందరగోళం తయారవుతుందని.. ఈ ఎఫెక్ట్‌ సాగర్‌‌ ఉప ఎన్నిక మీద పడుతుందని ఆయన అభిప్రాయం.

    దీంతో ఆయన చెప్పిన సలహాను అధిష్టానం గౌరవించి అంగీకరించింది.మరోవైపు.. సాగర్‌‌ స్థానాన్ని మళ్లీ నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్.. దుబ్బాక తరహాలో ఇక్కడ కూడా సత్తా చాటాలని బీజేపీ, ఒకప్పటి కంచుకోటను మళ్లీ ముట్టడించాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి. అప్పుడే వ్యూహరచన మొదలుపెట్టాయి. ఈ క్రమంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో ఇక్కడి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డిని ఇక్కడి నుంచి బరిలోకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.

    Also Read: ఈ బినామీల వల్లే అసలు సమస్యలు

    నాగార్జునసాగర్‌లో పోటీ చేసే విషయంలో జానారెడ్డి మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు ఆ స్థానానికి తన కొడుకును బరిలోకి దింపాలని అనుకున్నారు. కానీ.. తర్వాత తానే బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించారు. ఈ కారణంగానే కొత్త టీపీసీసీ చీఫ్ ఎంపికను నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పూర్తయ్యేవరకు ఆపాలని ఆయన కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫోన్ చేసి చెప్పినట్టు తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థి కావడం, సీనియర్ నేత కావడంతో జానారెడ్డి ప్రతిపాదనకు కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించిందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్.. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలకు చెప్పినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి వచ్చిన ఆ ఆదేశాలను పాటిస్తామని రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నేతలంతా అంగీకరించినట్టు తెలుస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్