ఏపీ నిరుద్యోగుల్లో నిరసన జ్వాలలు

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగుల్లో ఆగ్రహ జ్వాలలు రేగుతున్నాయి. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై ముప్పేట దాడి జరుగుతోంది. ఏమూల చూసినా నిరుద్యోగుల నిరసనలే కనిపిస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ రెండేళ్లు ఆలస్యమైనా ఉద్యోగాల జారీలో నిరుద్యోగుల ఆశలు ప్రతిబింబించలేకపోయింది. దీంతో వారు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వానికి నిరుద్యోగ సెగ తగులుతోంది. ఎక్కడికక్కడ నిరసనలే వినిపిస్తున్నాయి. నిరుద్యోగులు ప్రభుత్వానికి పాలాభిషేకాలు చేస్తారని భావించినా అది జరగలేదు. కడుపు మండిన నిరుద్యోగులు రోడ్డు […]

Written By: Srinivas, Updated On : June 22, 2021 3:26 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగుల్లో ఆగ్రహ జ్వాలలు రేగుతున్నాయి. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై ముప్పేట దాడి జరుగుతోంది. ఏమూల చూసినా నిరుద్యోగుల నిరసనలే కనిపిస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ రెండేళ్లు ఆలస్యమైనా ఉద్యోగాల జారీలో నిరుద్యోగుల ఆశలు ప్రతిబింబించలేకపోయింది.

దీంతో వారు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వానికి నిరుద్యోగ సెగ తగులుతోంది. ఎక్కడికక్కడ నిరసనలే వినిపిస్తున్నాయి.
నిరుద్యోగులు ప్రభుత్వానికి పాలాభిషేకాలు చేస్తారని భావించినా అది జరగలేదు. కడుపు మండిన నిరుద్యోగులు రోడ్డు మీదకు రావడంతో సీన్ రివర్స్ అయింది. అనుకున్నదొకటి అయిందొక్కటి అన్నట్లుగా మారింది పరిస్థితి.

గ్రూపు ఉద్యోగాలు 36 మాత్రమే ఉండడంతో నిరుద్యోగులు ఖంగు తిన్నారు. పోలీసు ఉద్యోగాలు కూడా నాలుగు వందలకే పరిమితం కావడంతో నిరుద్యోగుల్లో ఆగ్రహం పెరిగింది. రిజర్వేషన్లు తీసేస్తే జనరల్ కేటగిరీలో నాలుగైదు ఉద్యోగాలు మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. దీంతో వేలకు వేలు పెట్టి కోచింగ్ సెంటర్లలో పెట్టుబడి పెట్టిన నిరుద్యోగుల్లో హైరానా పెరుగుతోంది. జాబ్ క్యాలెండర్ ను వచ్చి మోసంగా అభివర్ణిస్తూ విశ్లేషణలు చేస్తుండడంతో యువతలో ఆవేశం పెరుగుతోంది.

రోజురోజుకు నిరుద్యోగుల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఉద్యోగాల విప్లవం సృష్టించామన్న ప్రభుత్వ ప్రకటనలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. యువత గందరగోళంలో పడిపోయి ఆవేశానికి లోనవుతోంది. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా ఉన్నట్లయితే బాగుండేదని ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. యువతలో ఇంత ఆవేశం వస్తుందని వారు కూడా ఊహించలేకపోయారు.