ఇలాంటి స్థితిలో కూడా రాజశేఖర్ హీరోగానే సినిమాలు చేయడానికి కిందామీదా పడుతున్నాడు. అయితే, రాజశేఖర్ కోసం కథలు రాసేవాళ్ళు ఎవరు లేరు. దాంతో రీమేక్ ల మీద పడ్డాడు ఈ సీనియర్ హీరో. నిజానికి రాజశేఖర్ కి రీమేక్ రాజా అనే పేరు కూడా ఉంది లేండి. ఇప్పటికే రాజశేఖర్ చాలా రీమేక్ లు చేశారు. చాలా గ్యాప్ తర్వాత ఆయన మరో రీమేక్ చేస్తున్నాడు.
రాజశేఖర్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ… శేఖర్. ఈ సినిమా ఒక థ్రిల్లర్ మూవీ అని తెలుస్తోంది. మలయాళంలో సూపర్ హిట్టయిన ఒక క్రైం అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆధారంగా ఈ ‘శేఖర్’ మూవీ రాబోతుంది. అయితే వచ్చే వారం నుండి ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలు కానుంది. ఈ సినిమాలో అను సితార, ముస్కాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
రాజశేఖర్ కి ఇప్పుడు తప్పనిసరిగా హిట్ కావాలి కాబట్టి, ఈ సినిమా కోసం ఏమైనా చేస్తాను అంటున్నాడు ఈ హీరో. ‘గరుడవేగ’ వల్ల వచ్చిన క్రేజ్ ఆ తర్వాత విడుదలైన ‘కల్కి’తో హుష్ కాకి అయిపోవడంతో రాజశేఖర్ పరిస్థితి ప్రస్తుతం బాగాలేదు. అందుకే, ఈ శేఖర్ సినిమా పైనే ఆశలు అన్ని పెట్టుకున్నాడు. ఈ సినిమా అవుట్ ఫుట్ పై గట్తి నమ్మకంతోనే ఉన్నాడు.