Vundavalli Arun Kumar : చర్చకు షరతులు వర్తిస్తాయంటున్న ఉండవల్లి.. చాన్స్ మిస్

నిజంగా చర్చకు వస్తే ఏది వాస్తవమో తేలిపోతుంది. అయితే ఈ విషయంలో దొరికిపోతానన్న బాధ తెలియదు కానీ.. చాన్స్ ను ఉండవల్లి వదిలేసుకుంటున్నారు.

Written By: Dharma, Updated On : April 27, 2023 5:33 pm
Follow us on

Vundavalli Arun Kumar : ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ పట్టాన ఎవరికీ అర్ధం కారు. సామకాలిన రాజకీయ అంశాలపై స్పందించే గుణం ఉన్న ఆయన చర్యలెవరకీ అర్ధం కావు. పక్కా సమైఖ్య వాదిగా ఉన్న ఆయన తెలంగాణ ప్రగతి భవన్ కు వెళ్లి చర్చలు జరుపుతారు. విలువైన సలహాలు ఇస్తారు. ఏపీకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ ను గొప్పగా పొగుడుతారు. ఏదోఅనుకున్నాం కానీ కేసీఆర్ లాంటి అద్భుతమైన నాయకుడు లేడని కొనియాడుతారు. పవన్ కళ్యాణ్ మంచి నాయకుడని కితాబిస్తారు. ఆయన ఏదో రోజు ఉన్నత స్థాయికి చేరుకుంటారని చెబుతారు. చంద్రబాబు విధానాలను వ్యతిరేకించే ఆయన.. అదే చంద్రబాబుకు సారీ చెబుతారు. జగన్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తారు. మళ్లీ మరోసారి కీర్తిస్తారు. ఇలా రోజుకో ప్రకటనతో గడిపేస్తుంటారు. అయితే జీవితకాలం మాత్రం రామోజీరావు మార్గదర్శి కేసును మాత్రం వెంటాడుతునే ఉంటారు. తనకు రాజకీయ గుర్తింపు దక్కడానికి దాన్నో సాధనంగా ఎంచుకున్నారు.

సీఐడీ విచారణ..
ప్రస్తుతం మార్గదర్శిపై ఏపీ సర్కారు దృష్టిపెట్టింది. సీబీసీఐడీ విచారణ కొనసాగుతోంది. రామోజీపైన జగన్ అక్కసుతోనే చేయిస్తున్నారన్న విమర్శలున్నాయి. అటు జగన్ ప్రభుత్వ చర్యలను ఉండవల్లి స్వాగతిస్తున్నారు. దీంతో రాజకీయంగా ఈ అంశం పెద్ద దుమారం రేపుతోంది. తాజాగా మార్గదర్శి అంశంపై టీడీపీ నేతలు తనతో చర్చకు రావాలని ఉండవల్లి అరుణ్ కుమార్ సవాల్ చేశారు. దానికి జీవీ రెడ్డి అనే టీడీపీ అధికార ప్రతినిధి సరే అన్నారు. తాను సిద్ధమన్నారు. ఆయన చార్టెడ్ అకౌంటెంట్. పార్టీ అధికార ప్రతినిధిగా చర్చకు వస్తానన్నారో లేకపోతే ఏ హోదాలో చర్చకు వస్తానన్నారో కానీ.. ఆయన హోదా ప్రకారం టీడీపీ అధికార ప్రతినిధి కాబట్టి ఉండవల్లిఅరుణ్ కుమార్ కు ఇంత కన్నా గొప్ప చాన్స్ ఉండదు.

మంచిచాన్స్ మిస్..
అయితే చర్చలో తప్పులుంటే కడిగి పారేసే చాన్స్ ఉండవల్లికి దక్కింది. కానీ ఆయన షరతులు వర్తిస్తాయి అంటూ మెలిక పెట్టారు. రామోజీరావు సమక్షంలోనే చర్చించాలని పట్టుబట్టారు. అంతటితో ఆగకుండా ఈ చర్చలో రెడ్డి సామాజికవర్గం వ్యక్తి ఎందుకంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఇదేనా ఉండవల్లి పెద్దరికం అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నిజంగా చర్చకు వస్తే ఏది వాస్తవమో తేలిపోతుంది. అయితే ఈ విషయంలో దొరికిపోతానన్న బాధ తెలియదు కానీ.. చాన్స్ ను ఉండవల్లి వదిలేసుకుంటున్నారు. అసలు రాష్ట్రంలో ఏ సమస్యా లేదన్నట్టు.. అసలు బాధితులే లేని అంశాన్ని రచ్చ చేయడం ఏమిటన్న ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతోంది. తప్పు జరిగి ఉంటే నిరూపించాలి. లేకుంటే అంతటితో విడిచిపెట్టాలి. కానీ తనకు గుర్తింపు తెచ్చిన అంశం కాబట్టే ఉండవల్లి రామోజీరావును వెంటాడుతున్నారన్న టాక్ అయితే మాత్రం ఉంది.

అప్పటిలా గళం ఏదీ?
రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న ఎన్నో సమస్యలున్నాయి. ఉండవల్లి దాని గురించి ప్రస్తావించారు. టీడీపీ హయాంలో ఆయన చేసిన విమర్శలు.. అప్పటి పాలన.. ఇప్పుడు ఆయన వ్యవహారం చూస్తే ఆయన వక్రబుద్ధి ఇట్టే తెలిసిపోతుంది. అప్పట్లో పెద్దపెద్ద మాటలు, కోపం చూపులతో చేసిన వ్యాఖ్యలు ఏమైపోయాయి. వీళ్లెవరికి రాష్ట్రం గురించి కానీ.. ప్రజా ప్రయోజనాల గురించి పట్టింపే ఉండదని అర్ధమైంది. గత టీడీపీ ప్రభుత్వంపై విషం చిమ్మి జగన్ కు ఆయాచిత లబ్ధి చేకూర్చడంలో ఉండవల్లి ఒకరు. కానీ ఇప్పుడు జగన్ తప్పుల మీద తప్పులు చేస్తున్నా తన సామాజిక స్పృహను మరిచిపోయిన ఉండవల్లిని ఎలా అర్ధం చేసుకోవాలి? దానికి కాలమే నిర్ణయిస్తుంది.